వావివరసలు మరిచిన కామాంధుడు.. అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్య

కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం జరిగింది. వావివరసల మరిచిన ఓ కామంధుడు తోడబుట్టిన చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అవమానభారంతో బాధితులురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

news18-telugu
Updated: February 14, 2020, 1:26 PM IST
వావివరసలు మరిచిన కామాంధుడు.. అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజురోజూకీ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వావివరసలు మరుస్తున్న కామాంధులు చెల్లి, తల్లీ, బిడ్డా అనే తేడా లేకుండా తమ కామవాంఛ తీర్చుకుంటూ జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే అలాంటి మరో ఘటన కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. సొంత అన్నయ్యే చెల్లిపై దారుణానికి ఒడిగట్టాడు. ఊహించని ఘటనతో బాధితురాలు తీవ్ర మనోవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పాల్వంచ పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ పాతపాల్వంచలోని అన్నయ్య రాంబాబు ఇంటివద్ద వదిలి వెళ్లారు. అయితే యువతి అన్నయ్య రాంబాబు ఆమెను జ్యోతినగర్‌లో తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అన్నయ్యే కీచకుడిగా మారి సొంత చెల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రిగా అన్నివిషయాల్లో అండగా ఉంటాడనుకున్న అన్నయ్య అకృత్యానికి పాల్పడడంతో తీవ్ర ఆవేదన చెందింది.

అనంతరం యువతి అవమానభారంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఆ యువతి రోడ్డుపైకి రావడంతో గమనించిన స్థానికులు పాల్వంచలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇదిలావుంటే.. సొంత చెల్లిపై అన్న రాంబాబుతో పాటు అతడి స్నేహితుడు లైంగిక దాడికి పాల్పడినట్టు అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ విషయమై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు