విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏపీలో ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా డబ్బుల కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయిన అన్న.. తమ్ముడి భార్యపై నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ ఘటన హుకుంపేట మండలం రంగశీలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రైతు భరోసో కోసం అన్నయ్య కృష్ణ ఇంటికి ... తమ్ముడు తన భార్యతో కలిసి వెళ్లాడు. అయితే డబ్బులు ఇచ్చేది లేదని... అన్న తేల్చిచెప్పాడు. ఖర్చు కూడా అయిపోయాయి ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కృష్ణ చెప్పడంతో... అక్కడ్నుంచి తమ్ముడు వెళ్లిపోయాడు.
అయితే తమ్ముడు బయటకు వెళ్లగానే.. మరదలు కొండమ్మ బావను నిలదీసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బావ కృష్ణ మరదలు కొండమ్మపై నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. దగ్గర నుంచి కాల్పులు చేయడంతో... ఎడమచేయి కింద భాగంలో కొండమ్మకు బలమైన గాయం తగిలింది. దీంతో ఆమెను హుటాహుటిన పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం... విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.