హోమ్ /వార్తలు /crime /

Sister In Law: వదినామరిది నైట్ లాడ్జికెళ్లారు.. వేకువజామున 3 గంటలకు మరిదికి మెలకువ వచ్చి చూసేసరికి..

Sister In Law: వదినామరిది నైట్ లాడ్జికెళ్లారు.. వేకువజామున 3 గంటలకు మరిదికి మెలకువ వచ్చి చూసేసరికి..

వివాహేతర సంబంధాల వల్ల జరిగే అనర్థాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నా కొందరు తీరు ఏమాత్రం మారడం లేదు. వావివరుసలు మరిచి మరీ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తమిళనాడులో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది.

ఇంకా చదవండి ...

  ఏర్కాడ్: వివాహేతర సంబంధాల వల్ల జరిగే అనర్థాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నా కొందరు తీరు ఏమాత్రం మారడం లేదు. వావివరుసలు మరిచి మరీ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తమిళనాడులో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. సేలం జిల్లా ఏర్కాడ్ తమిళనాడులోని ఒక చూడచక్కని పర్యాటక ప్రాంతం. ఆకుపచ్చని అందాలతో కనువిందు చేసే ఈ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. విడిది చేసేందుకు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతానికి తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాకు చెందిన విజయ్(30) తన వదిన అయిన మంజు(26)తో వెళ్లాడు. వదినమరిది మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

  ఇది కూడా చదవండి: Husband: ఈమె భర్త వయసు 42 సంవత్సరాలు.. ఈ వయసులో అయ్యగారు ఏం చేశారో చూడండి..

  ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ వదినామరిది ఏర్కాడ్‌కు వచ్చి ఓ లాడ్జిలో భార్యాభర్తలమని చెప్పి గది అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ మద్యం తాగారు. ఆ సందర్భంలో విజయ్ తన వదిన మంజుకు ఓ విషయం స్పష్టం చేశాడు. తనకు పెళ్లి కుదిరిందని.. జనవరి 23న పెళ్లి చేసుకోబోతున్నానని.. ఇకపై మనం ఇలా కలవడం కుదరదని చెప్పాడు. ఈ విషయంలో విజయ్‌తో మంజు గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

  ఇది కూడా చదవండి: Government Doctor: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తూ ఇవేం పనులమ్మా.. అసలేం జరిగిందంటే..

  మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కొద్దిసేపు వాదించుకుని పడుకున్నారు. విజయ్‌కు వేకువజామున 3 గంటల సమయంలో మెలకువ వచ్చింది. చూస్తే.. పక్కన మంజు లేదు. బాత్రూమ్‌కు వెళ్లి ఉంటుందని భావించాడు. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డోర్ కొట్టాడు. ఆమె నుంచి స్పందన లేదు. డోర్ బద్ధలు కొట్టి చూడగా మంజు ఉరేసుకుని నగ్నంగా ఉన్న స్థితిలో కనిపించింది. అప్పటికే ఆమె చనిపోయింది.

  ఇది కూడా చదవండి: Youtube: యూట్యూబ్‌లో ఏందీ రోత వీడియోలు.. ఇంతకీ ఈమె ఎవరో.. చివరకు ఏమైందో తెలుసా..!

  ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరపగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభు, విజయ్ అన్నదమ్ములు. వీరిది ఉమ్మడి కుటుంబం. ప్రభుకు, మంజుకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఉపాధి నిమిత్తం ప్రభు 2017లో విదేశానికి వెళ్లాడు. ఆ క్రమంలోనే.. మంజు, విజయ్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రభు ఇంట్లో లేకపోవడంతో ఈ వదినమరిది నట్టింట్లోనే పిల్లల కళ్లుగప్పి రాసలీలలు సాగించేవారు. ఈ జంట పలుమార్లు ఏర్కాడ్‌‌కు వచ్చి గడిపి వెళుతుండేది. అలా వచ్చిన సందర్భంలోనే విజయ్ తనకు పెళ్లి కుదిరిన విషయాన్ని చెప్పాడు. తెల్లారేసరికి అనుమానాస్పద స్థితిలో మంజు విగతజీవిగా కనిపించింది.

  First published:

  ఉత్తమ కథలు