Home /News /crime /

BROTHER HAS GIVEN A SENSATIONAL CONFESSION THAT HE ELIMINATES HIS SISTER FOR THIS REASON SSR

Sister: వచ్చిన పెళ్లి సంబంధాలను పిన్ని కూతురు రిజెక్ట్ చేస్తోందని ఏ తమ్ముడైనా ఇలా చేస్తాడా..

నిందితుడు శరవణన్

నిందితుడు శరవణన్

తమిళనాడులోని రామనాథపురంలో ఘోరం జరిగింది. తన పిన్ని కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావించి వచ్చిన పెళ్లి సంబంధాలను కాదంటోందని ఓ యువకుడు ఆమెను హత్య చేశాడు.

    రామనాథపురం: తమిళనాడులోని రామనాథపురంలో ఘోరం జరిగింది. తన పిన్ని కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావించి వచ్చిన పెళ్లి సంబంధాలను కాదంటోందని ఓ యువకుడు ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

    ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామనాథపురం నెహ్రు నగర్‌ 5వ వీధికి చెందిన సెల్వం ఓ ప్రైవేట్ వెడ్డింగ్ మహల్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి స్వాతి(27)కి ఇటీవల సెల్వం పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. M.E చదివిన స్వాతి పెళ్లికి ‘నో’ చెప్పింది. దీంతో.. స్వాతిని ఆమెకి తమ్ముడు వరసయ్యే శరవణన్ అనే 21 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేశాడు. స్వాతి హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్య వెనక ఉన్న అసలు కారణం తెలిసి విస్తుపోయారు.

    ఇది కూడా చదవండి: Hijra Phone Call: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హిజ్రా ఫోన్ కాల్ ఆడియో.. అయ్యో పాపం అనిపిస్తుంది..

    స్వాతి ఓ యువకుడిని ప్రేమించింది. అతనినే పెళ్లి చేసుకోవాలని భావించి తెచ్చిన సంబంధాలకు ‘నో’ చెబుతోంది. అక్క మరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్లికి ఒప్పుకోవడం లేదని తెలిసిన శరవణన్ కోపంతో రగిలిపోయాడు. ‘నువ్వు లవ్ చేసిన అతను నాకు నచ్చలేదు.. తెచ్చిన సంబంధం మంచిది. ఈ అబ్బాయినే పెళ్లి చేసుకో’ అని శరవణన్ స్వాతితో చెప్పాడు. రెండేళ్ల నుంచి అతనిని ప్రేమిస్తున్నానని, అతనినే పెళ్లి చేసుకుంటానని స్వాతి స్పష్టంగా చెప్పింది. అక్క సమాధానం తమ్ముడికి నచ్చలేదు. అతను మన కంటే తక్కువ కులం వాడని, అతనిని చేసుకుంటే పరువు పోతుందని శరవణన్ స్వాతికి చెప్పాడు. ఆమె తన మాటలను పట్టించుకోకపోవడంతో శరవణన్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నువ్వు ప్రేమించిన వ్యక్తితో తాను మాట్లాడాలని శరవణన్ చెప్పాడు. అందుకు స్వాతి నిరాకరించింది.

    ఇది కూడా చదవండి: Friends: ఆంటీ విషయంలో క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. అసలేం జరిగిందంటే..

    ఈ పరిణామాలతో అక్కపై మరింత రగిలిపోయిన శరవణన్ ఆమెపై కోపంతో క్షణికావేశంలో గొంతు కోశాడు. రక్తపుమడుగులో విలవిలలాడిపోతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ రక్తపుమడుగులోనే అక్కను వదిలేసి శరవణన్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో స్వాతి, శరవణన్ తప్ప ఎవరూ లేరు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పరువు హత్యకు బాధ్యుడైన శరవణన్‌ మూడు రోజుల నుంచి తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Brutally murder, Crime news, Marriages cancel, Tamilnadu

    తదుపరి వార్తలు