Home /News /crime /

BROTHER ELIMINATES HIS SISTER FOR REFUSING ARRANGED MARRIAGE INCIDENT HAPPEND IN RAICHUR DISTRICT SSR

Shocking: ‘అబ్బాయి నల్లగా ఉన్నాడు.. నాకు నచ్చలేదు.. ఈ పెళ్లొద్దు’ అని చెల్లి చెబితే ఏ అన్న అయినా ఇలా చేస్తాడా..!

చంద్రకళ, శ్యామసుందర్

చంద్రకళ, శ్యామసుందర్

రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా గబ్బూరు గ్రామానికి చెందిన చంద్రకళ అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. అయితే.. పెళ్లి చూపుల రోజే అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని చంద్రకళ చెప్పింది. ఆమె అన్నయ్య శ్యామసుందర్ మాత్రం అబ్బాయి మంచివాడని, రంగుదేముందని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు.

ఇంకా చదవండి ...
    రాయచూర్: పెళ్లనేది ఇద్దరి ఇష్టప్రకారం, రెండు కుటుంబాల అంగీకారంతో జరగాల్సిన ఓ పవిత్రమైన వేడుక. అబ్బాయి అమ్మాయికి నచ్చకపోయినా.. అమ్మాయి అబ్బాయికి నచ్చకపోయినా పెద్దలు మరో సంబంధం చూసి ఇద్దరికీ ఇష్టమైతేనే పెళ్లి చేయాలి. బలవంతంగా పెళ్లి చేసినా ఆ బంధం కలకాలం నిలవదు. అయితే.. అబ్బాయి అమ్మాయికి నచ్చకపోవడానికి, అమ్మాయి అబ్బాయికి నచ్చకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఎవరి ప్రాధాన్యతలు వారికుంటాయి. కొందరు అందాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. కొందరు ఆహార్యం నచ్చక అబ్బాయి నచ్చలేదని చెబుతుంటారు. అబ్బాయి నచ్చలేదని చెప్పినందుకు ఓ అన్న చెల్లి ప్రాణం తీశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా గబ్బూరు గ్రామానికి చెందిన చంద్రకళ అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. అయితే.. పెళ్లి చూపుల రోజే అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని చంద్రకళ చెప్పింది. ఆమె అన్నయ్య శ్యామసుందర్ మాత్రం అబ్బాయి మంచివాడని, రంగుదేముందని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు.

    చంద్రకళ అప్పటికీ ఒప్పుకోకపోవడంతో.. ‘నువ్వు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది’ అని శ్యామసుందర్ తెగేసి చెప్పాడు. చంద్రకళ ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి ఆమె మనసు అంగీకరించలేదు. ఆమె ఇష్టంతో పనిలేకుండా అన్న శ్యామసుందర్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు. పెళ్లి మరో రెండు రోజుల్లో ఉందనగా.. ఈ పెళ్లి తాను చేసుకోనంటే చేసుకోనంటూ చంద్రకళ శ్యామసుందర్‌కు తేల్చి చెప్పింది. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నానని, తప్పకుండా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని శ్యామసుందర్ చెప్పాడు. ఈ విషయంలో అన్నాచెల్లెలి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది.

    ఇది కూడా చదవండి: Meerut: మగాడిగా మారాలని అనుకున్న ఈ యువతికి ఊహించని అనుభవం ఎదురైంది..

    తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్యామసుందర్ క్షణికావేశంలో తాను తీసుకొచ్చిన సంబంధాన్నే కాదంటావా అంటూ చంద్రకళపై కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో చంద్రకళ తీవ్రంగా గాయపడింది. రక్తస్రావం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయింది. చెల్లి మృతి చెందడంతో శ్యామసుందర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. గబ్బూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చంద్రకళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. నిందితుడు శ్యామసుందర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. చెల్లికి పెళ్లి చేయాలనుకున్న అన్న తాపత్రయం చివరికి ఆమెను చితి మీద కట్టెల్లో కాలిపోయేలా చేసింది. క్షణికావేశంతో కాకుండా చెల్లిని అర్ధం చేసుకుని ఉంటే చంద్రకళ బతికి ఉండేది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Karnataka, Murder

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు