హోమ్ /వార్తలు /క్రైమ్ /

అయ్యో పాపం.. ఆడుకుంటూ పరుగులు తీసిన పిల్లలు.. వేడి వేడి పాలల్లో పడి బాలిక మృతి..

అయ్యో పాపం.. ఆడుకుంటూ పరుగులు తీసిన పిల్లలు.. వేడి వేడి పాలల్లో పడి బాలిక మృతి..

విలపిస్తున్న తల్లిదండ్రులు

విలపిస్తున్న తల్లిదండ్రులు

యూపీలోని హర్దోయ్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేడి వేడి పాలల్లో పడి ఓ చిన్నారి మరణించింది. ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ఇంట్లో ఆడుకుంటున్నట్లుగానే మనకు అనిపించవచ్చు.కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏవైపు నుంచి మృత్యువు మంచుకొస్తుందో మనం ఊహించలేం. నీటి బకెట్‌లో పడి.. చీర ఉయ్యాల మెడకు చుట్టుకొని.. కారులో డోర్‌పడి.. ఇలా ఎంతో మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హర్దోయ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేడి వేడి పాలల్లో పడి ఓ ఆరేళ్ల బాలిక మరణించింది. ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

హర్దోయ్ జిల్లాలోని మాల్వన్ ప్రాంతంలోని దయాల్‌పూర్ గ్రామానికి చెందిన గిరీంద్ర, సురేంద్ర అన్నాదమ్ముళ్లు. వీరిద్దరు పాల ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంటారు. ఇద్దరికీ పెళ్లయింది. గిరీంద్రకు రాజ్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. సురేంద్రకు ప్రగ్యా అనే 6 ఏళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంట్లో ప్రతిరోజూ పాలను వేడి చేసి.. వాటితో జున్ను తయారు చేస్తుంటారు. శనివారం ఉదయం పెద్ద పాన్‌లో పాలు పోసి వేడి చేశారు. వాటితో పన్నీర్ చేయాల్సి ఉంది. పొయ్యిపై పాలు మరుగుతున్నాయి. అదే సమయంలో పాన్‌కు కొద్ది దూరంలో ప్రగ్యా, రాజ్ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పరుగులు పెడుతూ.. ప్రమాదవశాత్తు పాన్‌లో పడిపోయారు. పాలు సలసలా కాగుతుండడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

అయ్యో ఎంతటి విషాదం.. తండ్రి చావును కోరిన కొడుకు ప్రేమ.. ఏమైందంటే..?

కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని మాల్వాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. కాలిన గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడం.. పరిస్థితి ఎక్కువగా ఉండడంతో.. మాల్వాన్ కమ్యూనిటీ సెంటర్ వైద్యులు మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకున్న కాసేపటికే ప్రగ్యా మరణించింది. రాజ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో సురేంద్ర, గిరీంద్ర కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న ప్రగ్యా.. అంతలోనే విగతజీవిగా మారడాన్ని.. వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రగ్యా మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆరేళ్ల పాప వేడి వేడి పాలల్లో పడి మరణించడంతో.. స్థానికులు కూడా కంటతడిపెట్టారు.

Kidnap : తల్లి పక్కలో ఉన్న బిడ్డ రాత్రికి రాత్రే మాయం .. చేసింది ఎవరో ..ఎందుకో తెలుసా

తెలంగాణ (Telangana)లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన బాలిక.. డోర్‌పడడంతో ఊపిరాడక మరణించింది. బాలిక లోపలికి వెళ్లిన తర్వాత డోర్‌వేసుకుంది. అది లాక్ పడింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. డోర్లన్నీ మూసుకుపోవడంతో ఊపిరాడక చిన్నారి కన్నుమూసింది. జూన్ 2న నాగర్‌కర్నూలు జిల్లాలోని నాగనూలు గ్రామంలో ఈ ఘటన జరిగింది. కారు నుంచి దుర్వాసన వస్తుండడంతో బాలిక మృతి ఘటన వెలుగులోకి వచ్చింది.

First published:

Tags: Crime, Crime news, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు