మైనర్ బాలికను రేప్ చేసిన అన్న, అతడి ఫ్రెండ్.. గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి

చంఢీఘర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఆమె అన్న పది నెలల నుంచి రేప్‌కు పాల్పడ్డాడు. బాలిక అన్నతో పాము అతని స్నేహితుడు కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నాడు.

news18-telugu
Updated: September 26, 2020, 2:36 PM IST
మైనర్ బాలికను రేప్ చేసిన అన్న, అతడి ఫ్రెండ్.. గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చంఢీఘర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఆమె అన్న పది నెలల నుంచి రేప్‌కు పాల్పడ్డాడు. బాలిక అన్నతో పాము అతని స్నేహితుడు కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నాడు. అయితే బాలిక గర్భవతి అని తెలియడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. 9వ తరగతి చుదువుతున్న 15 ఏళ్ల బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతి అని తేలింది. బాలిక మైనర్ కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు బాలికను విచారించారు. తన అన్న, అతని స్నేహితుడు ఆమెను చేసినట్టు బాలిక విచారణ సంద్భంగా పోలీసులకు తెలిపింది. తన అన్న స్నేహితుడు 10వ తరగతి చదువుతున్నట్టు చెప్పింది.

గతేడాది డిసెంబర్‌ నుంచి వారిద్దరు తనను పలుమార్లు రేప్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధితురాలి అక్కకు ఈ ఏడాది జనవరిలో పెళ్లి అయిందని తెలిపారు. బాధితురాలి తల్లికి దృష్టి లోపం ఉండటం వల్ల కుతూరు గర్భవతి అన్న సంగతి గుర్తించలేకపోయిందన్నారు. ఈ ఘటనపై బాధితురాలి మాట్లాడుతూ.. తన బిడ్డపై రేప్ జరిగనట్టు తనకు తెలియదన్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. తన కుమారుడు డ్రగ్ర్స్‌కు బానిసగా మారాడని.. ఎప్పుడూ ఇంటి మీదకు ఏదో ఒక గొడవ తీసుకుని వచ్చేవాడని తెలిపింది. తన భర్త 2012లో కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడని చెప్పింది.

ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బాధితురాలు అన్న, అతని స్నేహితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి అన్నను అరెస్ట్ చేసినప్పటికీ.. అతని స్నేహితుడు మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఇక, బాధితురాలి కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు ఆమెను షెల్టర్ హోమ్‌కు తరలించారు.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading