సెక్స్ వర్కర్లకు నరకం.. కండోమ్ లేకుండానే పడుకోవాలని..

సెక్స్ వర్కర్లతో వ్యభిచారం చేయిస్తూ, వారిపై వేధింపులకు పాల్పడ్డాడో యజమాని. వారు వ్యభిచారానికి పనికొస్తారో లేదోనని పరిశీలించడానికి ముందుగా తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు.

news18-telugu
Updated: October 23, 2019, 6:49 PM IST
సెక్స్ వర్కర్లకు నరకం.. కండోమ్ లేకుండానే పడుకోవాలని..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెక్స్ వర్కర్లతో వ్యభిచారం చేయిస్తూ, వారిపై వేధింపులకు పాల్పడ్డాడో యజమాని. వారు వ్యభిచారానికి పనికొస్తారో లేదోనని పరిశీలించడానికి ముందుగా తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి తెచ్చేవాడు. కొన్ని సార్లు కండోమ్ లేకుండానే శృంగారం చేయాలని.. తాను తృప్తి పొందితే సరి, లేకపోతే వారికి నరకం చూపించేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు సెక్స్ వర్కర్లు. వివరాల్లోకెళితే.. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఓ బ్రాడ్లీ లీస్టర్ (54) అనే వ్యక్తి వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. తొమ్మిది మంది సెక్స్ వర్కర్లను చేర్చుకొని వారితో దందా నడిపిస్తున్నాడు. అయితే, కస్టమర్లకు వాళ్లు సుఖం ఎలా అందిస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్లను తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేసేవాడు. కండోమ్ లేకుండానే తనతో పడుకోవాలని వేధించేవాడు. సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ వస్తాయని చెప్పినా వినకుండా వారిని శారీరకంగా వేధించాడు. ట్రైనింగ్ అంటూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు.

అతడి వేధింపులు శ్రుతిమించడంతో భరించలేక ఆ సెక్స్ వర్కర్లంతా కలిసి అతడిపై తిరుగుబాటు చేశారు. అందరూ కలిసి లీస్టర్‌పై 16 రేప్‌ కేసులు, 10 అసభ్యప్రవర్తన కేసులు పెట్టారు. శిక్షణ పేరుతో తమకు నరకం చూపించాడని, ఓరల్ సెక్స్, మసాజ్.. తదితరాలు చేయించుకునేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్స్ వర్కర్ల తిరుగుబాటు ఆ దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు