Brooklyn Subway Station Shooting: అమెరికా మరోసారి కాల్పుల ఘటనతో వార్తలలో నిలిచింది. ఈ దురదృష్టకర ఘటన బ్రూక్లిన్ లోని సబ్ వే స్టేషన్ లో మంగళవారం జరిగింది. ఒక దుండగుడు కార్మికుల మాదిరిగా డ్రెస్ ధరించి, మాస్క్ పెట్టుకుని మెట్రో స్టేషన్ కు వచ్చాడు. అప్పుడు స్టేషన్ వందల సంఖ్యలో ప్రయాణికులతో కిటకిట లాడు తుంది. ప్రయాణికులు తాము.. ఎక్కాల్సిన ట్రైన్ కోసం కొందరు వేచి చూస్తుండగా.. మరికొందరు ఇక మన గమ్యం చేరామంటూ రైళ్లలో నుంచి ప్లాట్ ఫామ్ మీదుగా నడుచుకుంటూ తమ గమ్య స్థానాలకు వెళ్లిపోతున్నారు.
ఈ క్రమంలో ఒక ఆగంతకుడు బ్రూక్లిన్ లోని 36 వ స్ట్రీట్ సబ్వేలో (Brooklyn Subway Station)ప్లాట్ ఫామ్ మీదకు చేరుకున్నాడు. వస్తునే.. అక్కడే ఉన్న ప్రయాణికులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అమాయక ప్రజలను టార్గెట్ గా చేసుకుని ఏకంగా 33 రౌండ్ల కాల్పులను జరిపాడు. దీనితో పాటు.. కాల్పులకు ముందు 2 స్మోక్ బాంబులను కూడా విసిరాడు. దీంతో అక్కడంతా దట్టమైన పోగ వ్యాపించింది. కాసేపు అక్కడి వారికి ఏంజరుగుతుందో అర్థం కాలేదు. భయంతో పరుగులు తీశారు. అక్కడ వాతావరణం అంతా.. భీతావాహాకంగా మారిపోయింది.
నిముషాల్లో ప్లాట్ ఫామ్ అంతా రక్తపు మరకలతో ఎర్రగా మారిపోయింది. ఈ ఘటనలో.. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. మరో 13 మంది తొక్కిసలాటతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఈ ఘటన జరిగిన విధానంను 9-11, సంవత్సర ఉగ్రవాద బీభత్సాన్ని గుర్తు చేసుకున్నారు. దాడి చేశాక అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఉగ్రవాద కుట్ర ఉందా.. అన్న కోణంలో విచారణ చేపట్టారు.
ప్రస్తుతం నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 50 వేల అమెరికన్ డాలర్లను రివార్డుగా ప్రకటించారు. అయితే, ఫ్రాంక్ జేమ్స్ అనే వ్యక్తి.. యూ హల్ లో ట్రక్కును అద్దెకు తీసుకున్నారు. ఇతనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇతని చిరునామా.. విస్కాన్సిన్, ఫిలడెల్ఫియా రెండింటిలోను ఉంది. ఇతను నల్ల జాతీయుడు. ఎత్తుగా ఉన్నాడు. మంచి శరీర సౌష్టవాన్ని కల్గి ఉన్నాడు. గ్యాస్ మాస్క్ ధరించి ఉన్నాడు. ఆరెంజ్ కలర్ కన్ స్టకన్ డ్రెస్ ధరించి ఉన్నాడు. అయితే వీటన్నింటి మధ్య తలెత్తుతున్న అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే బ్రూక్లిన్ దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా...? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని న్యూయార్క్ పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.