Goa : గోవా బీచ్‌లో బ్రిటన్ మహిళ... ఏం చేసిందో తెలిసి షాకైన పోలీసులు...

Goa Beach : ఎక్కువ కాలం బ్రిటీష్ పాలకుల చేతిలో ఉన్న గోవాకి విదేశీయులు రావడం సహజమే. తాజాగా అలా వచ్చిన ఓ బ్రిటన్ మహిళ చేసిన పనికి పోలీసులు కంగారుపడ్డారు.


Updated: February 15, 2020, 2:15 PM IST
Goa : గోవా బీచ్‌లో బ్రిటన్ మహిళ... ఏం చేసిందో తెలిసి షాకైన పోలీసులు...
Goa : గోవా బీచ్‌లో బ్రిటన్ మహిళ... ఏం చేసిందో తెలిసి షాకైన పోలీసులు... (File)
  • Share this:
Goa Beach : గోవా... పనాజీ... బాగా బీచ్. రోజూలాగే పర్యాటకులతో సందడిగా ఉంది. చలి నుంచీ ఉపశమనం కలిగిస్తూ ఇప్పుడిప్పుడు పెరుగుతున్న ఎండ వేడిని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. గోవాలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి... పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. బీచ్‌కి వెళ్లే పర్యాటకుల్ని గమనిస్తూ... స్నాక్స్ తింటూ... విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి సమయంలో... బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ... బీచ్‌వైపు వెళ్లసాగింది. పోలీసుల దృష్టి ఆమెపై పడలేదు. ఇసుక తిన్నెలపై నడుస్తూ సముద్రంవైపు వెళ్తోంది. అప్పటికీ పోలీసుల దృష్టి ఆమెపై పడలేదు. ఇంతలో ఓ పోలీస్... స్నాక్స్ తినడం ఆపేశాడు. పక్కనున్న మరో పోలీస్... ఆగావేం తిను టేస్టీగా ఉన్నాయిగా అన్నాడు. అవతలి పోలీస్ ఏమీ మాట్లాడకుండా... "సముద్రంవైపు చూడు" అన్నట్లుగా కళ్లతోనే సైగ చేశాడు. అవతలి పోలీస్ సముద్రం వైపు చూశాడు. టూరిస్టులు సముద్రంలో దాటి వెళ్లకూడని ప్రాంతంవైపు వెళ్తూ కనిపించింది ఆమె. అతని చేతిలోని స్నాక్స్ జారి ప్లేటులో పడింది. కట్ చేస్తే... ఇద్దరు పోలీసులూ... పరిగెడుతూ సముద్రంవైపు వెళ్లారు. ఇసుక తిన్నెలు దాటారు. సముద్ర అలల్లోకి దూసుకెళ్లి... అప్పటికే సముద్ర నీటిలో గిలగిలా కొట్టుకుంటున్న ఆ బ్రిటన్ మహిళను పట్టుకున్నా్రు. ఆమె పోలీసుల నుంచీ విడిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నించింది. అయినా పట్టు వదలకుండా పట్టుకొని... బరబరా ఈడ్చుకొని తీరానికి తీసుకొచ్చారు.

పది నిమిషాలపాటూ ఏడ్చిన ఆమె... తర్వాత శాంతపడింది. అప్పుడు అడిగారు... "వాట్ హ్యాపెండ్... వై ఆర్ యు ఎండింగ్ యువర్ లైఫ్" అని. ఆమెలో ఏదో తెలియని ఆవేదన. కొన్ని క్షణాల మౌనం తర్వాత మాట్లాడింది. తన భర్తతో కలిసి... గోవా ట్రిప్‌కి వచ్చాననీ, తనను వదిలేసి, ట్రావెల్ డాక్యుమెంట్లతో వెళ్లిపోయాడని చెప్పింది. అలా మానసికంగా చాలా డిస్టర్బ్ అయి... ఆత్మహత్య చేసుకోవాలనుకుందని పోలీసులు అర్థమైంది.

ఆమెకు దాదాపు 50 ఏళ్లుంటాయి. ఇప్పుడు పోలీసులకు ఇది కొత్త తలనొప్పే. ఆమెను తిరిగి తన సొంత దేశానికి పంపాలి. అందుకోసం ఇమ్మిగ్రేషన్ అధికారులకు జరిగిన విషయం చెప్పాలి. అలాగే సూసైడ్‌ ఘటనకు సంబంధించి రాసే కేసు వివరాల రిపోర్టును అధికారులకు ఇవ్వాలి. ఆ తర్వాత ఆమె నిజంగానే బ్రిటన్ జాతీయురాలే అన్నది ఇమ్మిగ్రేషన్ అధికారులు కన్ఫామ్ చేసుకోవాలి. అలాగే... ఆమెను తిరిగి బ్రిటన్ పంపేందుకు ఏర్పాట్లు చెయ్యాలి. ఇలా చాలా ఉంటుంది. ఏది ఏమైనా ఓ మహిళ ఇలా సూసైడ్‌కి యత్నించడం చుట్టుపక్కల పర్యాటకులకు ఆవేదన, ఆశ్చర్యం కలిగించింది.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు