హోమ్ /వార్తలు /క్రైమ్ /

అన్నాదమ్ముళ్లకు ఒకే రోజు పెళ్లి.. మరుసటి రోజే కొత్త కోడళ్ల విశ్వరూపం.. అందరికీ మత్తు మందు ఇచ్చి..

అన్నాదమ్ముళ్లకు ఒకే రోజు పెళ్లి.. మరుసటి రోజే కొత్త కోడళ్ల విశ్వరూపం.. అందరికీ మత్తు మందు ఇచ్చి..

కొత్త పెళ్లి కూతుళ్లు తమ భర్తతో పాటు అత్తింటి వారికి టీ ఇచ్చారు. ఐతే అందులో మత్తు మందు కలిపి ఇవ్వడంతో.. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వారు నిద్ర మత్తులో ఉన్న సమయంలో... ఈ పెళ్లి కూతుళ్లు తమ విశ్వరూపం చూపించారు.

కొత్త పెళ్లి కూతుళ్లు తమ భర్తతో పాటు అత్తింటి వారికి టీ ఇచ్చారు. ఐతే అందులో మత్తు మందు కలిపి ఇవ్వడంతో.. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వారు నిద్ర మత్తులో ఉన్న సమయంలో... ఈ పెళ్లి కూతుళ్లు తమ విశ్వరూపం చూపించారు.

కొత్త పెళ్లి కూతుళ్లు తమ భర్తతో పాటు అత్తింటి వారికి టీ ఇచ్చారు. ఐతే అందులో మత్తు మందు కలిపి ఇవ్వడంతో.. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వారు నిద్ర మత్తులో ఉన్న సమయంలో... ఈ పెళ్లి కూతుళ్లు తమ విశ్వరూపం చూపించారు.

  బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ (Sonam Kapoor) నటించిన డాలీకి డోలీ (dolly ki doli) సినిమా చూశారా..! అందులో ఆమె దొంగ పెళ్లి కూతురు పాత్రను పోషించింది. పెళ్లి పేరుతో మోసం చేస్తుంటుంది. అచ్చం ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా యూపీ (Uttar Pradesh) లోని హత్రాస్‌లో మరో ఘటన వెలుగుచూసింది. పెళ్లి పేరుతో అత్తింటి వారిని సర్వం దోచేశారు కొత్త కోడళ్లు. కుటుంబం మొత్తానికి మత్తు మందు ఇచ్చి...వారు నిద్ర మత్తులో ఉన్న సమయంలో.. నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హత్రాస్ పట్టణంలోని సాస్నీ పరాస్ టాకీస్ సమీపంలో దుష్యంత్ వర్ష్నీ, గౌరవ్ వర్ష్నీ ఫ్యామిలీ నివసిస్తోంది. వీరు చాలా రోజులుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. పర్సర గ్రామంలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, చాలా మంచివారని మధ్యవర్తి ద్వారా తెలుసుకున్నారు. అనంతరం అమ్మాయిలను చూశారు. వీళ్లకు బాగా నచ్చారు. అంతే ఆ మరుసటి రోజే.. అంటే మార్చి 22న అన్నాదమ్ముళ్ల వివాహం జరిగింది. మధ్యవర్తి కోరిక మేరకు గలీ జోగియాన్ ప్రాంతంలో ఉన్న ఆయన మామ నివాసంలో పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం కొత్త జంటలు ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. సాయంత్రం అన్నాదమ్ముళ్లిద్దరు తమ భార్యలతో కలిసి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అక్కడ ముఖాముఖి కార్యక్రమం జరిగింది. కొత్త పెళ్లి కూతుళ్లను అందరూ పరిచయం చేసుకున్నారు.

  రేపిస్ట్‌లను ఉరితీయకూడదు.. జీవితాంతం జైల్లోనే కుమిలి కుమిలి చావాలి.. కోర్టు సంచలన తీర్పు

  మరుసటి రోజు సాయంత్రం కొత్త పెళ్లి కూతుళ్లు తమ భర్తతో పాటు అత్తింటి వారికి టీ ఇచ్చారు. ఐతే అందులో మత్తు మందు కలిపి ఇవ్వడంతో.. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వారు నిద్ర మత్తులో ఉన్న సమయంలో... ఈ పెళ్లి కూతుళ్లు తమ విశ్వరూపం చూపించారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగలును కాజేసి.. అక్కడి నుంచి ఉడాయించారు. మరుసటి రోజు మధ్యాహ్నం అత్తింటి వారు నిద్రలేచి చూసే సరికి.. పెళ్లి కూతుళ్లు కనిపించలేదు. ఏం జరిగిందో అర్ధం చేసుకోవడానికి.. వారికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇంట్లో బీరువాలు ఓపెన్ చేసి ఉన్నాయి. లక్ష రూపాయల నగదుతో, నగలు, మొబైల్ ఫోన్‌లు మాయం అయ్యాయి. ఘటనలపై బాధిత యువకులు సస్నీ కొత్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  వివాహిత ఆత్మహత్య.. లోదుస్తుల్లో సూసైడ్ నోట్.. పోస్ట్‌మార్టం చేస్తుండగా లభ్యం.. అందులో షాకింగ్ నిజాలు

  పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగ పెళ్లి కూతుళ్ల కోసం వెతికారు. కానీ ఎక్కడా దొరకలేదు. వారి మొబైల్ నంబర్లు కూడా ఆఫ్ అయ్యాయి. తమకు పెళ్లి చేసిన మధ్యవర్తి నెంబర్ కూడా దొరకలేదు. ఆ పెళ్లి కూతుళ్లను తమ చెల్లెల్లే అని చెప్పి.. అతడు పెళ్లి చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమది బరేలీ అని చెప్పాడని వివరించారు. కానీ ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని బాధితులు వాపోయారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని సస్ని కొత్వాలి ఎస్ఐ కృత్‌పాల్ సింగ్ తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

  First published:

  Tags: Crime, Crime news, Up news, Uttar pradesh, Wedding

  ఉత్తమ కథలు