Telangana: చేసేది స్వచ్ఛంద సేవ... కావాల్సింది అదనపు కట్నం.. కాబోయే వరుడి నిర్వాకమిది

గోడు వెల్లబోసుకుంటున్న బాధితురాలు

యువకునితో నిశ్చితార్థం కావడంతో యువతి తల్లిదండ్రులు కుడా అతడితో ఎటు వెళ్లినా ఏమనలేదు. తీరా ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడాది అయింది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గింది. దాంతోపాటే అతడిలో పెళ్లి ఆశ కూడా తగ్గుతూ వచ్చింది. పెండ్లి చేసుకోమంటే కుంటిసాకులు చెప్పడం షూరు చేశాడు.

  • News18
  • Last Updated :
  • Share this:
    అతనో స్వచ్చంధ సంస్థ నిర్వహకుడు. నిరుపేదలు, అభాగ్యులను చూస్తే చాలు చలించిపోతాడు. దీంతో సంఘంలో మంచి పేరు గ‌డించాడు. కరోనాకు ముందు ఒక యువతితో పెండ్లి చేసుకుంటానని అంగ‌రంగ వైభ‌వంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. కోవిడ్ మహమ్మారి కారణంగా పెండ్లిని పలు దఫాలుగా వాయిదా వేస్తువచ్చాడు. అదే సమయంలో యువతితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. యువకునితో నిశ్చితార్థం కావడంతో యువతి తల్లిదండ్రులు కుడా అతడితో ఎటు వెళ్లినా ఏమనలేదు. తీరా ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడాది అయింది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గింది. దాంతోపాటే అతడిలో పెళ్లి ఆశ కూడా తగ్గుతూ వచ్చింది. పెండ్లి చేసుకోమంటే కుంటిసాకులు చెప్పడం షూరు చేశాడు. తీరా కుటుంబ సభ్యులు నిలదిస్తే తనకు రూ. 10 లక్షల కట్నం, బంగారం ఇస్తేనే పెండ్లి చేసుకుంటానని లేకుంటే లేదని కరాకండిగా తేల్చేశాడు.

    వివరాల్లోకెళ్తే... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన మద్దకూరి సాయిబాబా ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు. గతేడాది డిసెంబర్ 30న సాయిబాబా.. నిజామాబాద్ లోని పోచమ్మగల్లి కి చెందిన యువతి (21) తో ఎంగేజ్మెంట్ జరిగింది. సాయిబాబా అక్కా బావలు, వారి కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఆ యువతి తల్లిదండ్రులు పెండ్లికి సిద్ధమయ్యారు. మగ పెళ్లివారు కట్నకానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇదే సమయంలో కాబోయే కొత్తజంట.. సాయిబాబా కుటుంబ సభ్యులకు సంబంధించిన పంక్షన్లకు వెళ్లడం.. వారి అక్కా, పిల్లలు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఇద్దరికి ఎంగేజ్మెంట్ కావడంతో ఆ యువతి తల్లిదండ్రులు కుడా ఎటు వెళ్లినా వద్ధనలేదు. ఈ క్రమంలోనే మూడు నెలలు గడిచిపోయాయి. దేశంలో లాక్డౌన్ విధించారు.

    కరోనా తగ్గిన తరువాత పెండ్లి చేసుకుంటానని.. ఆ యువతి తల్లిదండ్రుల వద్ధ బైక్ కోనుగోలు కోసం డబ్బులు కుడా తీసుకున్నాడు సాయిబాబా. అయితే ఇదే సమయంలో యువతి కుటుంబ‌స‌భ్యులు పెండ్లికోసం ఒత్తిడి చేశారు. దీంతో నిందితుడు అసలు విషయం బయటపెట్టాడు. తనకు అదనపు కట్నం ఇవ్వాలని.. లేకపోతే పెండ్లి చేసుకునేది లేదని చెప్పడు. తనకు పోలిస్ కమీషనర్ స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని... మీ బ్రతుకులు రోడ్డుకిడుస్తానని అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించాడు.

    దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని.. లేని పక్షంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతానని బాధితురాలు తెలిపింది. నిందితుడు తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నాడని ఆమె వాపోయింది.
    Published by:Srinivas Munigala
    First published: