హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..

పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి మండపం నుంచి వరుడు మధ్యలోనే ఎస్కేప్ అయ్యాడు. వరుడు కనిపించకపోవడంతో పెళ్లికి వచ్చినవాళ్లంతా అవాక్కయ్యారు. అతడికి ఆ పెళ్లి ఇష్టంలేదని ఆలస్యంగా అందరికీ తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాదులాట జరగుతుండగా ఇంతలో అనుకోని సంఘటన జరిగింది.

ఇంకా చదవండి ...

పెళ్లి మండపం. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పెళ్లి పీటల మీదకు పెళ్లికుమార్తె కూడా చేరుకుంది. ముహూర్తం సమయం మించిపోతోంది. అయినప్పటికీ ఇంకా వరుడు పెళ్లి పీటల మీదకు రాలేదు. వరుడు ఉంటున్న గదికి వెళ్లి చూస్తే వారికో షాకింగ్ సీన్ కనిపించింది. ఆ గదిలో ఎవరూ లేరు. పెళ్లి మండపం అంతా వెతికినా అతడి జాడ లేదు. ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. దీంతో అతడికి పెళ్లి ఇష్టం లేదనీ, అందుకే ఈ పెళ్లి మండపం నుంచి పారిపోయాడని తేలిపోయింది. వచ్చిన బంధువులంతా నానా మాటలు అనుకుంటున్నారు. అమ్మాయి తరపు వాళ్లు రచ్చ రచ్చ చేశారు. అబ్బాయి తరపు వాళ్లను నిలదీశారు. ఇంత జరుగుతోంటో ఆ వధువు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఆమె మారు మాట్లాడకుండా పెళ్లి బట్టల్లోనే నడుచుకుంటూ పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె ఎటు వెళ్లిపోయిందో, ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందోనన్న భయంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో పరిధిలో మోరదాబాద్ పరిధిలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి మండపం నుంచి వరుడు మధ్యలోనే ఎస్కేప్ అయ్యాడు. వరుడు కనిపించకపోవడంతో పెళ్లికి వచ్చినవాళ్లంతా అవాక్కయ్యారు. అతడికి ఆ పెళ్లి ఇష్టంలేదని ఆలస్యంగా అందరికీ తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాదులాట జరగుతుండగా ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. పెళ్లి మండపం నుంచి పెళ్లి దుస్తుల్లోనే ఓ బ్యాగు చేతిలో పట్టుకుని వధువు వెళ్లిపోయింది. ఆమె ఎటు వెళ్లిపోయిందో, ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందోనన్న భయంతో బంధువులు వెంటనే స్థానికంగా ఉన్న తాహిర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.

ఇది కూడా చదవండి: ప్రేయసిని ఇంటికి తీసుకొచ్చేసిన యువకుడు.. భార్యాభర్తలుగా కొత్త లైఫ్.. 15 రోజుల్లోనే విషాదం

వారు వధువు కోసం గాలిస్తుండం మొదలు పెట్టారు. మజ్ హోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్ ప్రాంతంలో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఓ మహిళ తిరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఏమయిందమ్మా.. ఎందుకు ఇక్కడ ఉన్నావు? అని స్థానికులు ప్రశ్నిస్తే ఆమె విచిత్ర సమాధానం చెప్పసాగింది. ’నా పేరు వందన. మాకు కొద్ది సేపటి క్రితమే పెళ్లయింది. నా భర్త ఫంక్షన్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఎక్కడకు వెళ్లిపోయాడో తెలియడం లేదు. ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చాను‘ అంటూ ఆమె వింత సమాధానం చెప్పింది. ఆమె ఆచూకీ దొరకడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఆమె స్టేట్ మెంట్ తీసుకున్నారు. అయితే ఆమె చెబుతున్నదానికీ, ఫంక్షన్ వద్ద బంధువులు చెబుతున్న దానికి చాలా తేడా ఉందనీ, విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆమెకు మెడికల్ టెస్టులు నిర్వహించి స్థానికంగా ఉన్న నారీ నికేతన్ కు పంపించారు.

ఇది కూడా చదవండి: శునకంపై అత్యాచారం.. అర్ధరాత్రి ఓ యువకుడి నిర్వాకం.. చాటుగా వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టిన కుర్రాళ్లు.. చివరకు..

First published:

Tags: Crime news, Crime story, Love marriage, Marriage reception

ఉత్తమ కథలు