BRIDE REENA THAKUR ALIAS SITA CHAUDHARY OF JABALPUR HAS DONE MORE THAN 30 MARRIAGES CAUGHT IN31ST TIME SK
ఈమె 30 పెళ్లిళ్లు చేసుకుంది.. బట్టలు మార్చినంత ఈజీగా భర్తలను మార్చుతున్న మహిళ
పోలీసుల అదుపులో నిత్య పెళ్లి కూతురు
పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకొని.. 31వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళను పక్కాగా వలపన్ని పట్టుకున్నారు.
ఇటీవల పెళ్లి పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాగా డబ్బున్న వారిని చూసి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అత్తింటి నుంచి డబ్బు, నగలతో పారిపోవడం.. ఇలాంటి ఘటనల తరచూ వార్తల్లో వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిన యూపీ, రాజస్థాన్‌లో ఈ తరహా కేసులు (Wedding Scams) ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను (Fake marriage gang) రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకొని.. 31వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్న మహిళ (Fake Bride)తో పాటు మరికొందరిని పక్కాగా వలపన్ని పట్టుకున్నారు.
రాజస్థాన్ (Rajasthan)లోని గిరిజనుల ప్రాబల్య జిల్లా దుంగార్పూర్ జిల్లా సగ్వారా పోలీసులు... ఇప్పటివరకు 30 మందిని వివాహం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వధువును అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్(Jabalpur)లో దొంగ పెళ్లికూతురు రీనాను అదుపులోకి తీసుకున్నారు. ఈమె పెళ్లి పేరుతో రూ.5 లక్షలతో ఏడాది క్రితం పారిపోయింది. ఈ కేసుకు సంబంధించిన ఆమెను అరెస్టు చేశారు. విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. ఆమె అసలు పేరు సీతా చౌదరి. కానీ నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో.. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ పేరు మార్చుకుంటుంది. చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారిని ఎంచుకొని.. పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత రెండు మూడు రోజులు ఉండి.. డబ్బు, నగలతో అత్తింటి నుంచి ఉడాయిస్తుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జోధ్‌పూర్ నివాసి ప్రకాశ్ చంద్ర భట్‌కు గత ఏడాది వివాహం జరిగింది. పెళ్లిళ్ల ఏజెంట్ పరేష్ జైన్.. రీనా ఠాకూర్ అనే యువతితో పెళ్లి జరిపించాడు. పెళ్లిని సెట్ చేసినందుకు పరేష్ అతడి నుంచి 5 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఐతే పెళ్లయ్యాక వారం రోజుల పాటు అత్తింట్లో ఉన్న రీనా.. ఆ తర్వాత తన భర్త ప్రకాశ్ చంద్రతో కలిసి జబల్పూర్కు వెళ్లింది. అక్కడి నుంచి మళ్లీ తిరిగి వస్తుండగా.. రీనా కొందరు వ్యక్తులనున పిలిపించి...ప్రకాశ్ చంద్రపై దాడి చేయించింది. అనంతరం తన గ్యాంగ్‌తో కలిసి పారిపోయింది. ఆ తర్వాత పరేష్ జైన్, రీనా తమ ఫోన్ నెంబర్లను మార్చేశారు. అలా నకిలీ పెళ్లిళ్ల ముఠా చేతిలో ప్రకాశ్ చంద్ర మోసపోయాడు. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబరు 12న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక విషయాలు తెలిశాయి. జబల్పూర్కు చెందిన పూజా బర్మన్ అనే వ్యక్తి ఈ నకిలీ పెళ్లిళ్ల ముఠాను నడుపుతున్నట్లు గుర్తించారు. సీతా చౌదరి కూడా అతడితో కలిసి పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. నకిలీ పేర్లు, కొంతమంది అమ్మాయిల చిరునామాలు, ఆధార్ కార్డులు, ఇతర ధృవపత్రాలు తయారు చేసి.. పలు రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించి.. నకిలీ పెళ్లిళ్లు చేయిస్తున్నాడు. అనంతరం వారి నుంచి డబ్బు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకొని.. వధువులు పారిపోతారు. ఇలా ఇప్పటి వరకు చాలా మందిని మోసం చేశారు.
నకిలీ పెళ్లిళ్ల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు పక్కాగా స్కెచ్ వేశారు. భాను ప్రతాప్ అనే కానిస్టేబుల్ తనకు ఓ పెళ్లి సంబంధం చూపించాలని సాధారణ వ్యక్తిలా పూజా బర్మన్ను ఆశ్రయించాడు. అతడు దాదాపు 10 మంది అమ్మాయిల ఫొటోలను చూపించి..రూ.5వేలు వసూలు చేశాడు. అందులో రీనా ఫొటో కూడా ఉంది. ఈ అమ్మాయి తనకు బాగా నచ్చిందని.. ఈమెను పెళ్లి చేసుకుంటానని భాను ప్రతాప్ చెప్పాడు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య డీల్ కుదిరింది. ఐతే అడ్వాన్స్‌గా రూ.50వేలు ఇవ్వాలని పూజా బర్మన్ అడిగాడు. సమాదియా మాల్ దగ్గరకు వచ్చి ఇస్తామని భాను ప్రతాప్ చెప్పాడు. అనంతరం పూజా బర్మన్.. రీనా ఠాకూర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. పెళ్లి కొడుకుగా భాను ప్రతాప్, అతడి స్నేహితులుగా కానిస్టేబుల్ భూపేంద్ర సింగ్, వీరేంద్ర సింగ్ వెళ్లారు. రీనా ఠాకూర్ పేరు మార్చి.. కాజల్ చౌదరికిగా పరిచయం చేసుకుంది. కాసేపటి తర్వాత మహిళా పోలీసు బృందం అక్కడికి వెళ్లి.. రీనా ఠాకూర్‌ను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. రీనా ఠాకూర్ ఇప్పటి వరకు 30 పెళ్లిళ్లు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.