హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tragedy: సెప్టెంబర్ 2న ఈ యువతికి పెళ్లి.. శుభలేఖ ఇదే చూడండి.. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందంటే...

Tragedy: సెప్టెంబర్ 2న ఈ యువతికి పెళ్లి.. శుభలేఖ ఇదే చూడండి.. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందంటే...

చైతన్య పెళ్లి శుభలేఖ, చైతన్య (ఫైల్ ఫొటో)

చైతన్య పెళ్లి శుభలేఖ, చైతన్య (ఫైల్ ఫొటో)

సెప్టెంబర్ 2న ఆ యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి పత్రికలు అచ్చు వేయించారు. కరోనా మహమ్మారి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో అయినవాళ్లందరినీ పెళ్లికి ఆహ్వానించారు. ఇంత సంతోషంగా ఉన్న ఈ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో తెలియదు గానీ ఒక్క ఘటన ఆ యువతి జీవితాన్ని తలకిందులు చేసింది.

ఇంకా చదవండి ...

హిందూపురం: సెప్టెంబర్ 2న ఆ యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి పత్రికలు అచ్చు వేయించారు. కరోనా మహమ్మారి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో అయినవాళ్లందరినీ పెళ్లికి ఆహ్వానించారు. ఇంత సంతోషంగా ఉన్న ఈ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో తెలియదు గానీ ఒక్క ఘటన ఆ యువతి జీవితాన్ని తలకిందులు చేసింది. పెళ్లి మండపంలో అడుగుపెట్టాల్సిన ఆ యువతిని ప్రాణం లేని స్థితిలో స్మశానానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషాద ఘటన కర్నాటక నుంచి హిందూపురం వచ్చి స్థిరపడిన ఓ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్నాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా గౌరీ బిదునూరు తాలూకా వీరండహళ్లి గ్రామానికి చెందిన గంగరత్నమ్మ, నరసింహమూర్తి భార్యాభర్తలు. వీరికి చైతన్య అనే 20 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ కుటుంబం హిందూపురం మండలం సంతేబిదునూరుకొచ్చి స్థిరపడింది. ఆ ఊరిలోనే ఇల్లు కట్టుకుని, కాస్త పొలం కొనుక్కుని కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల చైతన్యకు వివాహం నిశ్చయించారు. పరిగి మండలం బీచిగానిపల్లికి చెందిన నరసింహమూర్తి అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చైతన్య కుటుంబం నిర్ణయించింది. సెప్టెంబర్ 2న సుముహూర్తం కుదిరింది. పెళ్లికి రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి.

ఈ క్రమంలోనే.. వధువు చైతన్య, ఆమె తండ్రి నరసింహమూర్తి కలిసి పెళ్లి దుస్తులు కొనేందుకు హిందూపురానికి బైక్‌పై వెళ్లారు. వరుడికి షూలు, వధువుకు దుస్తులు కొనుగోలు చేశారు. హిందూపురంలో ఉన్న తన స్నేహితులకు తండ్రితో కలిసి చైతన్య పెళ్లి పత్రికలు ఇచ్చింది. అనంతరం.. బీచిగానిపల్లికి వెళ్లేందుకు ఇద్దరూ బైక్‌పై బయల్దేరారు. అలా వెళుతుండగా.. మోతుకపల్లి పెన్నా బ్రిడ్జి దగ్గర వెనుక నుంచి వేగంగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ వీరి బైక్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో.. చైతన్య రెండు కాళ్లపై నుంచి సిమెంట్ ట్యాంకర్ చక్రాలు వెళ్లడంతో ఆమె కాళ్లు ఛిద్రమయ్యాయి. ఓ కాలైతే నడుం వరకూ విరిగిపోయింది. ఆ బాధ భరించలేక ఆమె చేసిన ఆర్తనాదాలు కలచివేశాయి. ఆమె తండ్రి నరసింహమూర్తికి కూడా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: Very Sad: నెల రోజుల క్రితమే అమ్మ చనిపోయింది... ఆ బాధను దిగమింగుకుని ఆదివారం డ్యూటీకి వెళుతుండగా..

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే.. అరగంటైనా అంబులెన్స్ రాకపోవడంతో చైతన్య నొప్పితో విలవిలలాడిపోయింది. ఆమె పరిస్థితిని చూసి అక్కడున్న వారు కంటతడిపెట్టుకున్నారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని గాయపడిన చైతన్యను, ఆమె తండ్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చైతన్య చనిపోయింది. ఆమె తండ్రిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టాలని భావించిన చైతన్య జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహంపై పడి తల్లి గంగరత్నమ్మ ఏడుస్తున్న తీరు చూసి ఇరుగుపొరుగు వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదంటూ నైరాశ్యంతో నిట్టూర్చారు.

First published:

Tags: Anantapuram, AP News, Bike accident, Hindupuram, Marriage, Road accident

ఉత్తమ కథలు