Home /News /crime /

BRIDE KIDNAPPED AT BEAUTY PARLOUR IN PUNJAB BA

మేకప్ కోసం వెళితే.. కిడ్నాప్ అయిన పెళ్లికూతురు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాసేపట్లో పెళ్లి బరాత్ జరగాల్సి ఉండగా, పెళ్లికుమార్తెను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆమెను ఎత్తుకెళ్లారు.

    మనం చాలా సినిమాల్లో పెళ్లికూతురిని కిడ్నాప్ చేసిన సీన్లు చూసి ఉంటాం. హీరోయిన్‌ ఇంటికి వచ్చిన కిడ్నాపర్లు ఆమె కుటుంబాన్ని బెదిరించడం, పెళ్లికూతురు తల మీద గన్ పెట్టి బెదిరించడం లాంటి సీన్లు చూసి ఉంటాం. కొన్ని కొన్ని సినిమాల్లో హీరోయిన్ తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న కారణంతో ఇంట్లోంచి పారిపోయిన సీన్లు కూడా చూసి ఉంటాం. అయితే, ఇది మాత్రం రియల్. నిజంగా జరిగిన ఘటన. పెళ్లికూతురిని రియల్‌గా కిడ్నాప్ చేశారు.

    Crime news in telugu, Delhi, Bride, marriage in Function hall, Shocking Incident in Wedding, Strange marriages, New Delhi, Gun Fire in Wedding Hall, పెళ్లి మండపంలో కాల్పులు, పల్లకిలో పెళ్లి కూతురు, న్యూఢిల్లీ పెళ్లి చూడడానికి వచ్చి
    నమూనా చిత్రం


    పంజాబ్‌లో ఈ ఘటన జరిగింది. ముక్తాసర్ జిల్లా చక్కీవాలా గ్రామానికి చెందిన యువతి పెళ్లి కోసం మేకప్ వేయించుకోవడానికి ఉదయం 6 గంటలకు ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఆమెను బ్యూటీపార్లర్‌లో వదిలిపెట్టిన యువతి సోదరుడు, సమీపంలోని బజారులో వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లాడు. అయితే, అంతలోనే ముగ్గురు కిడ్నాపర్లు వచ్చారు. బ్యూటీ పార్లర్‌లో నుంచి ఆమెను బలవంతంగా లాక్కొచ్చారు. ఓ కారులో ఎక్కించుకుని పారిపోయారు.

    Constable Downs Booze in Dry Bihar, Gets Rejected by Bride Minutes Before His Wedding
    ప్రతీకాత్మక చిత్రం


    కిడ్నాపర్లు పెళ్లికూతురిని ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు పక్కన షాపు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకుని పారిపోయేందుకు ఆమె ప్రయత్నిస్తుండగా, ఇద్దరు యువకులు ఆమెను లాక్కెళుతున్నా దృశ్యాలు అందులో ఉన్నాయి. మొత్తం ఆరుగురు యువకులు ఈ కిడ్నాప్‌లో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు.

    పెళ్లికూతురిని కిడ్నాప్ చేస్తున్న దుండగులు


    గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళుతుందో పూర్తిగా తెలిసిన వారే ఈ కిడ్నాప్‌నకు పాల్పడిన ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి స్నేహితులను విచారిస్తున్నారు.

    పెళ్లికూతురు కిడ్నాప్ దృశ్యాలు
    First published:

    Tags: Punjab, VIRAL NEWS, Viral Videos

    తదుపరి వార్తలు