బరాత్‌లో డ్యాన్స్ బీభత్సం.. డ్రైనేజీలో పడిన పెళ్లికొడుకు

పెళ్లికొడుక్కి ఘనస్వాగతం పలికేందుకు ఆ చిన్న బ్రిడ్జికి అవతలి వైపు పెళ్లికుమార్తె తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. పెళ్లికొడుకు తరఫు వారి జోష్ చూసి వారు కూడా ఆనందంగానే ఉన్నారు.

news18-telugu
Updated: February 10, 2019, 11:26 PM IST
బరాత్‌లో డ్యాన్స్ బీభత్సం.. డ్రైనేజీలో పడిన పెళ్లికొడుకు
నమూనా చిత్రం
news18-telugu
Updated: February 10, 2019, 11:26 PM IST
నోయిడాలో ఓ పెళ్లివేడుకలో అపశ్రుతి దొర్లింది. పెళ్లికొడుకు, అతని ఫ్రెండ్స్, బంధువులు అందరూ బరాత్‌లో బీభత్సంగా డ్యాన్స్ చేస్తుండగా ఓ బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో పెళ్లికొడుకు సహా 15 మంది ఆడ్రైనేజీలో పడిపోయారు. నోయిడాలోని సెక్టార్ 52లో ఉన్న హోషియార్‌పూర్‌లో శనివారం (ఫిబ్రవరి 9)న ఈ ఘటన జరిగింది. హోషియార్‌పూర్‌లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. పెళ్లికొడుకుని మండపం వరకు తీసుకువస్తున్నారు. బాజా భజంత్రీలు, పెళ్లికొడుకు, అతని ఫ్రెండ్స్, బంధువులు అందరూ బీభత్సంగా డ్యాన్స్‌లు చేస్తున్నారు. అయితే, పెళ్లి మండపానికి, రోడ్డుకి మధ్య ఓ చిన్న మురుగుకాలువ ఉంది. ఆ కాలువ మీద నుంచి రావడానికి చిన్న బ్రిడ్జి లాంటిది ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆ బ్రిడ్జి మీద బీభత్సమైన డ్యాన్స్‌లు చేయడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది.

crime, Crime news in telugu, Pennsylvania, Bridegroom, Sexual harassment, లైంగిక వేధింపులు, పెళ్లి ముహుర్తాలు, పెళ్లి మండపం, పెళ్లికొడుకు, వెయిటర్, అసభ్య ప్రవర్తన
నమూనా చిత్రం


పెళ్లికొడుక్కి ఘనస్వాగతం పలికేందుకు ఆ చిన్న బ్రిడ్జికి అవతలి వైపు పెళ్లికుమార్తె తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. పెళ్లికొడుకు తరఫు వారి జోష్ చూసి వారు కూడా ఆనందంగానే ఉన్నారు. అయితే, వారి కళ్లముందే కాబోయే అల్లుడు అలా మురికి కాలువలో పడిపోయేసరికి వారు కూడా షాక్‌కి గురయ్యారు.

Crime, Sex, Sex addiction, Second marriage, brothers committed, Second marriage wife Stopped, Sex Addiction, Had Sex with 370 men, I have sex with, Sex with Nigerian Women, Women opens ups about sex, సెక్స్ అడిక్షన్, శృంగారం వ్యసనం 370 మంది మగాళ్లతో పడుకున్నా
నమూనా చిత్రం
డ్రైనేజీ కాలువలో పడిపోవడంతో పెళ్లికొడుకు, అతని బంధువుల బంగారు ఆభరణాలు కూడా పోయాయి. సుమారు 15 మంది గాయపడ్డారు. అందలో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో వధువు తరఫు వారు ఊపిరి పీల్చుకున్నారు.

web portal calculates dowry for pitch black prospective grooms jyotiraditya scindia tweets to pmo

పెళ్లికొడుకు డ్రైనేజీ కాలువలో పడిపోవడంతో అందరూ కలసి ఫంక్షన్ హాల్ యజమానితో గొడవకు దిగారు. అయితే, సుమారు 15 ఏళ్ల నుంచి అక్కడే తాను మ్యారేజ్ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నానని, ఎన్నో పెళ్లిళ్లు జరిగినా, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని యజమాని తెలిపాడు. చివరకు వివాదం పోలీసుల వరకు వెళ్లింది. అయితే, ఫంక్షన్ హాల్ కోసం ఇచ్చిన డబ్బులుమొత్తం తిరిగి ఇచ్చేసేందుకు ఓనర్ అంగీకరించాడు. వధువు తరఫు వాళ్లు ఇచ్చిన రూ.3లక్షలను తిరిగి ఇచ్చేశాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మళ్లీ పెళ్లికొడుక్కి పట్టుబట్టలు కట్టి పెళ్లిపీటలు ఎక్కించారు.

AP IAS officer spends just 30k for his sons wedding
ప్రతీకాత్మక చిత్రం


పెళ్లి అనేది అందరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే, ఈ వరుడు మాత్రం జీవితంలో మర్చిపోలేడు. మూడు ముళ్లకు ముందు మురుగుకాలువలో పడిన ఘటనను అతడు ఎప్పటికీ మర్చిపోలేడు.
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...