తాళికట్టే ముందు ట్విస్ట్.. పందిట్లో పెళ్లికొడుకును కట్టేసిన పెళ్లికూతురు...

తాళికట్టడానికి కొన్ని నిమిషాల ముందు పెళ్లికొడుకు చేసిన పనికి చిర్రెత్తుకొచ్చిన పెళ్లికూతురు అతడిని కట్టేసింది.

news18-telugu
Updated: December 14, 2019, 2:58 PM IST
తాళికట్టే ముందు ట్విస్ట్.. పందిట్లో పెళ్లికొడుకును కట్టేసిన పెళ్లికూతురు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తాళికట్టడానికి కొన్ని నిమిషాల ముందు పెళ్లికొడుకు చేసిన పనికి చిర్రెత్తుకొచ్చిన పెళ్లికూతురు అతడిని కట్టేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌‌నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, ఢిల్లీకి చెందిన వివేక్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. వధువు సొంత ఊరిలో పెళ్లికి సంబంధించిన భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, తాళి కట్టడానికి కొద్ది నిమిషాల ముందు తనకు కారు కట్నంగా కావాలని పెళ్లికొడుకు మొండికేశాడు. పెళ్లికి ముందు ఇలాంటివేం మాట్లాడుకోలేదని, ఇప్పుడు చివరి నిమిషంలో ఈ గొంతెమ్మ కోరికలు ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు మధ్య కూడా గొడవ జరిగింది. దీంతో వధువు తాను అతడిని పెళ్లిచేసుకోబోనని ప్రకటించింది. అనంతరం వివేక్‌ను పందిట్లోనే కట్టేశారు. వరుడి తల్లిదండ్రులను కూడా నిర్బంధించారు. అనంతరం వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, చివరకు ఇరువర్గాలు ఓ అంగీకారానికి వచ్చాయి. వధువు తరఫు వారు పెట్టుకున్న ఖర్చులన్నీ తిరిగి చెల్లించడంతో పెళ్లికొడుకుని, అతడి తల్లిదండ్రులని వదిలిపెట్టారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 14, 2019, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading