Bride: పెళ్లయిన 8వ రోజు ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఇంట్లో వాటిని చూసిన తరువాత విషయం తెలుసుకున్న భర్త..

పెళ్లి ఫోటో

పెళ్లయిన 8వ రోజు తనకు ఒంట్లో బాగోలేదని ఆస్పత్రికి వెళ్లింది శాంతి. కానీ ఆమె ఎంతకూ ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.

  • Share this:
    పోఖ్రాన్: రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌కు చెందిన బాబూరామ్ అనే యువకుడికి శాంతి అనే మహిళతో కొత్తగా పెళ్లయ్యింది. అయితే శాంతి మాత్రం కొద్దిరోజుల వరకు అతడితో శారీరకంగా కలిసేందుకు ఒప్పుకోలేదు. కొన్ని కారణాలు చెబుతూ.. ఇందుకోసం తనకు కొంత సమయం కావాలంటూ భర్తకు చెప్పుకుంది. అయితే కొద్దిరోజుల తరువాత పరిస్థితి మామూలుగా అవుతుందనుకున్న భర్త బాబూరామ్.. ఇందుకు ఒప్పుకున్నాడు. అయితే పెళ్లయిన 8వ రోజు తనకు ఒంట్లో బాగోలేదని ఆస్పత్రికి వెళ్లింది శాంతి. కానీ ఆమె ఎంతకూ ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ ఆస్పత్రి ఎక్కడ ఉందో కూడా ఆమె భర్త బాబూరామ్‌కు తెలియదు. అయితే కొద్దిసేపటికే అతడికి విషయం మొత్తం అర్థమైంది. ఇంట్లో డబ్బు, నగలు లేవని కుటుంబసభ్యులు చెప్పడంతో.. తన భార్య డబ్బు, నగలు తీసుకుని పారిపోయిందని అతడికి క్లారిటీ వచ్చేసింది.

    తన భార్య మోసం చేసే మహిళ అని తేలిపోయింది. అయితే ఈ మొత్తం కథలో మరో ట్విస్ట్ కూడా ఉంది. అది కొద్దిసేపటి తరువాత కానీ అతడికి తెలియరాలేదు. పెళ్లికి ముందు శాంతి ఎవరో బాబూరామ్‌కు తెలియదు. తనను కలిసి జగ్మల్ సింగ్ అనే మధ్యవర్తి తీసుకొచ్చిన సంబంధం బాబూరామ్‌కు నచ్చింది. దీంతో జగ్మల్ సింగ్, కొందరు బంధువుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆ తరువాత బాబూరామ్ నుంచి కొంత డబ్బు తీసుకుని జగ్మల్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    పెళ్లై 8 రోజుల తరువాత భార్య డబ్బు, నగలు తీసుకుని వెళ్లిపోవడంతో.. తనకు ఈ సంబంధం చూసిన జగ్మల్ సింగ్‌కు ఫోన్ చేశాడు బాబూరామ్. కానీ అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో జగ్మల్ సింగ్, శాంతి కలిసి తనను మోసం చేశారని బాబూరామ్‌కు తెలిసొచ్చింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.

    Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

    Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

    జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు.. పెళ్లి పేరుతో డబ్బు, నగలు దోచుకుపోయే ముఠానే ఈ పని చేసినట్టు అనుమానించారు. ఈ ముఠా సభ్యులు ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయమై ఆరా తీయడం మొదలుపెట్టారు. వీరిపై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి సమయంలో ఫోటోలు దిగడంతో ఆ మహిళ ఫోటోను తీసుకుని.. మరికొన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: