• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BRIDE DIED WITH HEART ATTACK HOURS AFTER WEDDING IN KARNATAKA SK

వైభవంగా పెళ్లి వేడుక.. కాసేపటికే కుప్పకూలి వధువు మృతి.. అసలేం జరిగిందంటే..

వైభవంగా పెళ్లి వేడుక.. కాసేపటికే కుప్పకూలి వధువు మృతి.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి తర్వాత పెళ్లి కుమార్తె లైలాకు గుండె నొప్పి రావడంతో కుప్పకూలింది. పెళ్లి కూతురు కింద పడిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కంగారు పడిపోయారు. ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • Share this:
    పెళ్లి వేడుకతో కళకళలాడిన ఆ ఇంట.. ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటి వరకు వినిపించిన ఆనంద కేరింతలు.. కాసేపటికే రోదనలుగా మారి మిన్నంటాయి. పెళ్లి బట్టల్లోనే వధువు కన్నుముసింది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే మృత్యు ఒడికికి చేరింది. కర్నాటకలోని అడ్యార్ పట్టణలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. లైలా అఫియా అనే 23 ఏళ్ల యువతి ముబారక్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 28న ఆదివారం వీరి వివాహ వేడుక అడ్యార్ మసీదులో అంగరంగ వైభంగా జరిగింది. లైలా సోదరుడి వివాహం కూడా అదే ఫంక్షన్ హాల్‌లో జరిగింది.

    అమ్మాయి తండ్రి అబ్దుల్ కరీం.. బీరప్పగద్దె జమాత్ అధ్యక్షుడు కావడం.. అదే మంటపంలో ఒకే ఫ్యామిలీకి సంబంధించి రెండు పెళ్లిళ్లు జరగడంతో.. అతిథులు భారీగా తరలివచ్చారు. వివాహ వేడుకను తిలకించి వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం మధ్యాహ్నం వరుడి ఇంట్లో పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది. ఆ రోజు సాయంత్రం వధూ వరులు, వారి కుటుంబ సభ్యులు వధువు ఇంటికి వెళ్లారు. రాత్రి అందరూ ఆట పాటలతో సందడి చేశారు. ఎంతో సంతోషంగా గడిపారు. ఐతే అర్ధరాత్రి తర్వాత పెళ్లి కుమార్తె లైలాకు గుండె నొప్పి రావడంతో కుప్పకూలింది.

    పెళ్లి కూతురు కింద పడిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కంగారు పడిపోయారు. ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గుండె పోటుతో చనిపోయిందని చెప్పారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత బీరప్పగద్దె మసీదు సమీపంలో ఖననం చేశారు. పెళ్లి జరిగిన కొన్ని గంటల్లోనే.. వధువు మరణించడంతో.. ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయ్యో పాపం అని అందరూ కంటతడి పెట్టారు.
    Published by:Shiva Kumar Addula
    First published: