హోమ్ /వార్తలు /crime /

రాత్రి పెళ్లి.. తెల్లారే అత్తారింటికి పంపిస్తోంటే కుప్పకూలిపోయిన వధువు.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పింది విని..

రాత్రి పెళ్లి.. తెల్లారే అత్తారింటికి పంపిస్తోంటే కుప్పకూలిపోయిన వధువు.. ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పింది విని..

ఉన్నట్టుండి ఆ వధువు కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో ఏంటో అర్థం కాలేదు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంధువులంతా ఆ ఆసుపత్రి వద్దకు క్యూ కట్టారు. వధువుకు ఏమయిందోనన్న టెన్షన్ అందరిలోనూ ఉత్కంఠ రేపింది.

    అంగరంగ వైభవంగా రాత్రి పూట పెళ్లి జరిగింది. వధువు ఇంట్లో జరిగిన ఆ పెళ్లి వేడుకకు బంధుమిత్రులంతా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. ఆ మరుసటి రోజే వధువును అత్తారింటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమెకు కుటుంబ సభ్యులంతా వీడ్కోలు పలుకుతున్నారు. ఉన్నట్టుండి ఆ వధువు కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో ఏంటో అర్థం కాలేదు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంధువులంతా ఆ ఆసుపత్రి వద్దకు క్యూ కట్టారు. వధువుకు ఏమయిందోనన్న టెన్షన్ అందరిలోనూ ఉత్కంఠ రేపింది. వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే ఆమె మరణించిందని తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ వరుడి గుండెల్లో గునపాలు దిగినట్టయింది. పెళ్లి చేసుకున్న కొద్ది గంట్లోనే అతడికి భార్యావియోగం కలగడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆమె మరణానికి కారణమేంటో తెలిసి బంధువులంతా షాకయ్యారు. ఒడిస్సా రాష్ట్రంలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఒడిస్సా రాష్ట్రంలోని సుబర్నపూర్ జిల్లాలోని జులుందా గ్రామంలో గురువారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. రోసా సా అనే యువతికి, టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ పర్దాన్ అనే యువకుడికి పెళ్లి జరిగింది. ఆ రాత్రి ఆ అమ్మాయి ఇంట్లోనే బంధువులంతా ఉన్నారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం నవ వధువును అత్తారింటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వారి ఆచారం ప్రకారం అత్తారింటికి వెళ్లేటప్పుడు వధువుకు ’బిడాయి‘ అనే వేడుక జరుగుతుంది. ఆ వేడుకలో వధువు తన పుట్టింటి వాళ్లను వదిలి వెళ్తున్నానన్న ఆవేదనతో తీవ్రంగా ఏడ్చింది. అలా ఏడుస్తూనే రోసా కుప్పకూలిపోయింది.

    ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

    ఆమెకు ఏమయిందా ఏంటా అని అంతా భయపడిపోయారు. వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తేల్చారు. వాస్తవానికి ఆమె కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ ఇలా వధువు మరణ వార్త వినాల్సి వస్తుందని తాము ఊహించలేదని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. కన్నవారిని విడిచి వెళ్తున్నానన్న ఆవేదనతో వెక్కి వెక్కి ఏడ్వడం వల్ల గుండె పోటు వచ్చి ఆమె మరణించి ఉంటుందని బంధువులు భావిస్తున్నారు. పెళ్లయిన కొద్ది గంటలకే వధువు మరణించడం, భార్యను అతడు కోల్పోవడం పట్ల అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!

    First published:

    ఉత్తమ కథలు