హోమ్ /వార్తలు /క్రైమ్ /

Viral Video: పెళ్లి ఏర్పాట్లను చూసి వధువులో ఉత్సాహం.. కారు టాప్ తీసి మరీ డాన్స్.. వరుడి బంధువు మృతి.. అసలేం జరిగిందంటే..

Viral Video: పెళ్లి ఏర్పాట్లను చూసి వధువులో ఉత్సాహం.. కారు టాప్ తీసి మరీ డాన్స్.. వరుడి బంధువు మృతి.. అసలేం జరిగిందంటే..

కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఓ వివాహ వేడుకలో ఘోరం జరిగింది. వధువు ఆనందోత్సాహం వరుడి కుటుంబ సభ్యుల్లోని ఒకరి ప్రాణం తీసింది. కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి ఏర్పాట్లను చూసి ఆ వధువు సంబరపడిపోయింది. కానీ..

  కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఓ వివాహ వేడుకలో ఘోరం జరిగింది. వధువు ఆనందోత్సాహం వరుడి కుటుంబ సభ్యుల్లోని ఒకరి ప్రాణం తీసింది. కనీవినీ ఎరుగని రీతిలో పెళ్లి ఏర్పాట్లను చూసి ఆ వధువు సంబరపడిపోయింది. ఆనందాన్ని తట్టుకోలేక తాను వస్తున్న కారులోంచే డాన్స్ చేయడం మొదలు పెట్టింది. అది చూసిన వరుడి బంధువులు కూడా పెద్ద సంఖ్యలో కారు చుట్టూ గుమిగూడి ఆమె డాన్స్ కు వీళ్లు కూడా కాళ్లు కదిపారు. ఆ సంతోషంలో అసలు తాము ఎక్కడ ఉన్నదీ మర్చిపోయారు. హైవేపై నడిరోడ్డుపై పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడి డాన్స్ చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సడన్ గా ఓ కారు వారి మీదకు దూసుకొచ్చింది. వధువు కారు పక్కన నిలబడి డాన్స్ చేస్తున్న వారిని ఢీకొట్టింది. ఫలితం ఒకరి ప్రాణం పోయింది. పదుల సంఖ్యలో బంధువులు ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పరిధిలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లోని నైమండీ ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరగాల్సి ఉంది. అంకుర్ అనే వ్యక్తితో హేమ అనే యువతికి పెళ్లి నిశ్చయమయింది. ఈ వేడుకకు వధువును ప్రత్యేకంగా కారులో తీసుకుని రావాల్సి ఉంది. డెహ్రాడూన్ హైవే నుంచి నైమండీ ప్రాంతానికి ప్రత్యేకంగా కారులో వధువు వస్తోంది. వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణానికి వచ్చేసరికి అక్కడి ఏర్పాట్లను చూసి వధువు సంభ్రమాశ్చర్యాలకు లోనయింది. బారాత్ తో తనకు స్వాగతం పలుకుతోంటే ఆమె ఆనందం తట్టుకోలేకపోయింది. కారు టాప్ ను తీసి మరి పైకి వచ్చి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది చూసిన వరుడి బంధువుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. పెద్ద సంఖ్యలో బంధవులు ఆ కారు చుట్టూ చేరి డాన్స్ చేయడం ప్రారంభించారు.

  ఇది కూడా చదవండి: ప్రేయసిని ఇంటికి తీసుకొచ్చేసిన యువకుడు.. భార్యాభర్తలుగా కొత్త లైఫ్.. 15 రోజుల్లోనే విషాదం

  అయితే ఆ కారు ప్రధాన రహదారి పక్కనే వస్తుండటంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగానే మారింది. ఇంతలో అతి వేగంగా వెళ్తున్న ఓ కారు వారి మీదకు దూసుకొచ్చింది. వధువు కారు పక్కన ఉన్న వారిని ఢీకొట్టింది. దీంతో వరుడికి సోదరుడి వరసయ్యే ప్రమోద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పదుల సంఖ్యలో అతిథులు తీవ్ర గాయాలపాలయ్యారు. వధువు కూడా పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

  ఇది కూడా చదవండి: పెళ్లి మండపం నుంచి వరుడు ఎస్కేప్.. వధువు చేసిన పనికి అంతా షాక్.. పెళ్లి బట్టల్లో ఉండే..

  First published:

  Tags: Crime news, Crime story, Love marriage, Marriage

  ఉత్తమ కథలు