కొద్ది రోజుల్లో పెళ్లనగా వధువు కిడ్నాప్.. తల నరికి దారుణ హత్య.. వరుడిపై డౌట్ తో ఆరా తీస్తే తెలిసిందో దారుణ నిజం..!

ప్రతీకాత్మక చిత్రం

మరికొద్ది రోజుల్లో పెళ్లనగా ఊహించని సంఘటన జరిగింది. పెళ్లికూతురిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను అత్యంత కిరాతకంగా తల నరికి మొండాన్ని మాత్రమే మిగిల్చారు. తలలేని కూతురి శవాన్ని చూసి ఆ తల్లిదండ్రులు

 • Share this:
  ఓ యువతికి ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి భారీగానే కట్నకానుకలు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. పెళ్లి ఏర్పాట్లు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లనగా ఊహించని సంఘటన జరిగింది. పెళ్లికూతురిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను అత్యంత కిరాతకంగా తల నరికి మొండాన్ని మాత్రమే మిగిల్చారు. తలలేని కూతురి శవాన్ని చూసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు పెళ్లి కొడుకే ప్రధాన కారణమని యువతి తల్లిదండ్రుల ఆరోపణ. ఆ యువకుడికి అంతకుముందే ఓ అమ్మాయితే ప్రేమ వ్యవహారం ఉందనీ, వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా ద్వారక బిగాహా గ్రామానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లికిగానూ వరుడికి దాదాపు 4 లక్షల విలువైన కట్నకానుకలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించారు కూడా. దీంతో పెళ్లి శుభలేఖలను కూడా బంధువులందరికీ పంచేశారు. అయితే కొద్ది రోజుల్లో పెళ్లనగా ఆ యువతి కుటుంబంలో ఊహించని ఘోరం జరిగింది. సడన్ గా యువతిని ఎవరో కిడ్నాప్ చేశారు. తమకు ఎవరూ శత్రువులు లేరనీ, అమ్మాయికి కూడా గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని తల్లిదండ్రులు వాపోయారు. ఆమెకు ప్రేమ వ్యవహారాలు లాంటివి కూడా లేవని చెబుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
  ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

  అయితే ఆ యువతి మిస్సయిన మరుసటి రోజే ఓ గుర్తు తెలియని యువతి శవాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం కిడ్నాప్ కు గురి అయిన యువతిదేనని పోలీసులు తేల్చారు. తల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చి గుండె నిండా ఆవేదనత కుప్పకూలిపోయారు. కారణం, ఆ మృతదేహానికి తల లేదు. అత్యంత కిరాతకంగా ఆ యువతి కాళ్లు, చేతులను కట్టేసి మరీ ఆ యువతి తల నరికేశారు. దారుణంగా చంపేశారు. తలలేని ఆ యువతి శవాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు మిస్సింగ్ కేసును కాస్తా మర్డర్ కేసుగా మార్చి విచారణ చేపడుతున్నారు. కాగా, ఆజాద్ వల్లే తమ కుమార్తె తమకు దక్కకుండా పోయిందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆజాద్ కు గతంలో వేరే అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని చెబుతున్నారు. తమ కుమార్తెతో పెళ్లి నచ్చని ఆ యువతి తరపు వాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని వాళ్లు అనుమానిస్తున్నారు.
  ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!
  Published by:Hasaan Kandula
  First published: