BRIDE AFTER 10 DAYS OF MARRIAGE ABSCONDED WITH JEWELLERY SB
పెళ్లి అయిన పదిరోజులకే.. వరుడుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు
ఫ్రతీకాత్మక చిత్రం
పెళ్లైన కొన్నిరోజులకు వధువు సోదరుడు అత్తగారింటికి వచ్చాడు. తన తండ్రి జైల్లో ఉన్నాడంటూ.. చెప్పాడు. ఆ తర్వాత అతని వెంట వధువు కూడా వెళ్లింది. ఫోన్ చేస్తే.. స్విచాఫ్ వచ్చింది.
ఇంట్లో పెళ్లి జరిగితే సందడి భలేగా ఉంటుంది. కుటుంబసభ్యులు, బంధువులతో ఇళ్లు కళకళలాడుతుంటోంది. ఇక ఆ ఇంటికి కొత్త కోడలు వస్తే.. మరింత ఆనందంగా ఉంటుంది. అలా ఓ ఇంట కొత్త కోడలు కుడి కాలు లోపల పెట్టి సంతోషం నింపింది. వివాహం అయిన పదిరోజులుకే నవ వధువు తన ప్రవర్తనతో అందరి హృదయాలు గెలుచుకుంది. అంతా ఎంత మంచి అమ్మాయి అంటూ.. పొగడటం కూడా ప్రారంభించారు. ఇంతలోపే అందరికీ దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది పెళ్లి కూతురు. అత్తారింటి నుంచి బంగారు ఆభరణాలతో వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటన ఆగ్రాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... బల్కేశ్వర్ నివాసి అమిత్ గుప్తా... సెప్టెంబర్ 15 2021న ఫిరోజాబాద్‌కు చెందిన ప్రియా అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం ఆర్యసమాజ్ మందిర్‌లో జరిగింది. అయితే వీరి పెళ్లి జరిగిన కొద్ది రోజుల తర్వాత... ప్రియ సోదరుడు సచిన్ అమిత్ గుప్తా ఇంటికి వచ్చాడు. ప్రియ తండ్రి జైల్లో ఉన్నాడని తెలిపారు. దీంతో ఆయనను జైలు నుంచి విడుదల చేయడానికి అతడి బెయిల్ కోసం లక్షన్నర రూపాయలు కావాలని కోరాడు. దీంతో వెంటనే సచిన్‌కు లక్షన్నర రూపాయలు కూడా ఇచ్చాడు. అయితే సచిన్ వెంట భార్య ప్రియ కూడా వెళ్లిపోయింది. అయితే ఇక్కడ ఫ్యామిలీకి అసలు ట్విస్ట్ తగిలింది. ప్రియ వెళ్తు వెళ్తూ ఇంట్లో ఉన్న నగల్ని కూడా తీసుకెళ్లింది.
దీంతో కంగారు పడ్డ అమిత్ ప్రియకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం అతడి ఫిర్యాదును స్వీకరించలేదు.దీంతో చివరకు కోర్టును ఆశ్రయించాడు. భార్య ప్రియ, అతని సోదరుడు సచిన్, ప్రియా అత్త రూపమతి, శ్రియాష్, లఖన్లపై మోసం, పరువు నష్టం తదితర అభియోగాలపై అమిత్ పిటిషన్ వేశాడు. మోసం, దేశద్రోహం తదితర అభియోగాలపై ఫిర్యాదు చేయాలని సీజేఎం ప్రదీప్ కుమార్ సింగ్ ఆదేశించారు. ఏప్రిల్ 17వ తేదిన ఫిర్యాది వాంగ్మూలం తీసుకోవాలన్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.