BREAKING NEWS ONE WOMAN TRAINEE SI SUICIDE IN TRAINING CENTER IN VIZAINAGARAM NGS VZM
Breaking News: మహిళా ఎస్ఐ ఆత్మహత్య.. శనివారమే శిక్షణ పూర్తి.. ఆత్మహత్యకు కారణం అదే..!
మహిళ ఎస్ ఐ ఆత్మహత్య
Women SI Suicide: పోలీసు శిక్షణ కళాశాలలో ఓ మహిళా ఎస్.ఐ ఆత్మహత్యకు పాల్పడింది. శనివారమే శిక్షణను పూర్తి చేసుకున్న ఆమె ఆత్మహత్యపై అనేక అనుమానాలు పెరుగుతున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి..?
Women SI Suicide:ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది.. తాజాగా అందుకు సంబంధించిన ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. మంచి జీతం.. అందమైన జీవితం.. మంచి గౌరవం.. హోదా అన్ని ఉన్నాయి. తమ కూతురు ఉన్నత శిఖరాలకు చేరుకుందని తల్లిదండ్రులు కూడా ఆనందంతో ఉన్నారు. ఇలా అంతా హ్యాపీగా ఉండాల్సిన సమయంలో ఓ మహిళ ఎస్ఐ (Women SI) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లా (Vizianagaram district) కేంద్రంలోని పోలీసు శిక్షణ కళాశాలలో ఈ ఘటన చేసుకుంది. మహిళ ఎస్ఐ తన గదిలో ఆత్మహత్య(Suicide) కు పాల్పడింది. ఆమె నిన్నే అంటే శనివారం తన శిక్షణను పూర్తి చేసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న కాసేపటికే అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య విషయం తెలియడంతో ఇటు విజయనగరం అటు కృష్ణాజిల్లా (krishna district) కోడూరు మండలం విషాదం నెలకొంది. పీటీసీ శిక్షణ పూర్తి అయ్యిందని.. ఇంటికి వస్తున్నా అని తల్లిదండ్రులకు, సన్నిహితులకు ఆనందంగా ఇటీవల చెప్పిన ఆమె.. ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఇటు పోలీసుల శిక్షణ కళాశాలలో సైతం విషాదం చాయలు కనిపించాయి. ఆమె చాలా ధైర్యవంతురాలని.. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అసవరం ఏమొచ్చిందో అంటూ అతా షాక్ కు గురవుతున్నారు.
కృష్ణాజిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన అవివాహిత (UN Married) అయిన భవాణి.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా (East Godavari district)లోని సఖినేటిపల్లి మహిళా ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ లో ట్రైనింగ్ నిమిత్తం భవానీ ఇక్కడికి చేరుకున్నారు. 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై భవానీ రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ తరువాత సఖినేటిపల్లి పీఎస్ లో పోస్టింగ్ లో పనిచేస్తున్నారు. ఇలా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఇంతటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో అని అంతా ఆశ్చర్యపోతున్నారు..
మహిళా ఎస్సై ఆత్మహత్య తరువాత సంఘటన స్థలానికి వన్ టౌన్ పోలీసులు చేరుకున్నారు.ఒ ఈ ఆత్మహత్యకు ఉద్యోగంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఎవరినుంచైనా ఒత్తిడి ఉందా..? లేక కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ప్రేమ వ్యవహారం కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహిళా ఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఎస్.ఐ ఆత్మహత్యకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి అంటున్నారు విజయనగరం పోలీసులు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.