BREAK UP TURNED VIOLENT FOR A BENGALURU COLLEGE STUDENT SSR
Break up: ‘ఇదేం పిచ్చి ప్రేమరా నాయనా’.. అర్ధరాత్రి మాజీ లవర్ ఇంటి దగ్గరకెళ్లి ఏం చేశాడో తెలిస్తే...
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమికులన్నాక ప్రేమలో విఫలం అవడం సహజం. అన్ని ప్రేమ కథలకు సుఖాంతాలుండవు. ప్రేమలో ఏదో ఒక కారణం వల్ల బ్రేకప్ చెప్పుకుని విడిపోవడం ఈరోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. అయితే.. ఆ బ్రేకప్ తర్వాత పరిణామాలు ఇరువురిలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలిగించకూడదు. కానీ.. బెంగళూరు నగరంలో ఓ బ్రేకప్ స్టోరీ హింసకు...
బెంగళూరు: ప్రేమికులన్నాక ప్రేమలో విఫలం అవడం సహజం. అన్ని ప్రేమ కథలకు సుఖాంతాలుండవు. ప్రేమలో ఏదో ఒక కారణం వల్ల బ్రేకప్ చెప్పుకుని విడిపోవడం ఈరోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. అయితే.. ఆ బ్రేకప్ తర్వాత పరిణామాలు ఇరువురిలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలిగించకూడదు. కానీ.. బెంగళూరు నగరంలో ఓ బ్రేకప్ స్టోరీ హింసకు దారితీసింది. ప్రేయసితో బ్రేకప్ అయిన తర్వాత తట్టుకోలేకపోయిన ఆ ప్రియుడు ఆమె స్కూటీని మంటల్లో తగులబెట్టాడు. బెంగళూరులోని విద్యరన్యపురలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. బెంగళూరులోని ఓ కాలేజీలో చదువుతున్న యువతి సంజయ్ మూర్తి అనే అదే కాలేజీలోకి చదువుతున్న యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ కొన్నాళ్లు సన్నిహితంగా మెలిగారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత యువతి తల్లి వారి ప్రేమను ఒప్పుకోకపోవడంతో సదరు యువతి సంజయ్‌ను దూరం పెట్టింది. దీంతో.. అప్పటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్న సంజయ్ పలుమార్లు ఇదే విషయమై ప్రేయసితో గొడవ పడ్డాడు.
గత జనవరి 12న పట్టరాని కోపంతో ప్రేయసి ఇంటికెళ్లిన సంజయ్ ఆమెతో ఘర్షణకు దిగాడు. ఆమె సంజయ్‌తో మాట్లాడేందుకు ఇష్టం లేదని, వెంటనే తన ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాలని అతనితో చెప్పింది. దీంతో.. మరింత కోపోద్రేకంతో ఊగిపోయిన యువతిని, యువతి తల్లిని చంపుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఫిబ్రవరి 2 అర్ధరాత్రి తర్వాత అందరూ నిద్రపోయాక ప్రేయసి ఇంటివద్దకెళ్లిన సంజయ్ ఇంటి బయట పార్క్ చేసిన స్కూటర్‌ను తగులబెట్టాడు.
ఉదయాన్నే నిద్ర లేచి చూసే సరికి ఇంటి వెలుపల ఉన్న స్కూటీ మంటల్లో కాలిపోయినట్లు గమనించిన సదరు యువతి అనుమానమొచ్చి సీసీ టీవీ ఫుటేజీని చెక్ చేసింది. ఆ ఫుటేజీలో సంజయ్ ఆ టూవీలర్‌పై పెట్రోల్ పోసి.. తగులబెడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో బెంబేలెత్తిపోయిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రేయసిని హడలెత్తించిన సంజయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.