13 మందిని నడిరోడ్డుపై కాల్చి చంపారు...

బ్రెజిల్‌లోని రియో డీ జెనీరో నగరానికి సమీపంలో డ్రగ్స్ సరఫరాదారుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు

news18-telugu
Updated: February 9, 2019, 4:25 PM IST
13 మందిని నడిరోడ్డుపై కాల్చి చంపారు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 9, 2019, 4:25 PM IST
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో బ్రెజిల్లో 13 మందిని పోలీసులు నడిరోడ్డు మీద కాల్చి చంపారు. బ్రెజిల్ ‌లోని రియో డి జెనిరో నగరానికి సమీపంలోని శాంతా థెరిసా పట్టణంలో ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వారు రంగంలోకి దిగారు. పోలీసులను చూసి డ్రగ్స్ పెడలర్స్ దాక్కున్నారు. ఈ క్రమంలో వారి మీద పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

బ్రెజిల్ షూటౌట్‌లో పాల్గొన్న పోలీసులు
బ్రెజిల్ షూటౌట్‌లో పాల్గొన్న పోలీసులు


పోలీసులు ఎవరూ గాయపడలేదని డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. 13 మంది అనుమానిత డ్రగ్స్ పెడలర్స్ చనిపోయినట్టు ధ్రువీకరించింది. కాల్పులు జరిగినప్పుడు స్పాట్‌లోనే 11 మంది చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున మాదకద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Brazil Rio, Rio Shootout, Drug smugglers killed, Brazil drug sumgglers, Rio Drus smugglers, బ్రెజిల్, రియోలో షూటౌట్, రియోలో డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ పెడలర్స్‌పై కాల్పులు, బ్రెజిల్లో డ్రగ్స్ కాల్పులు
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచంలో అత్యంత ఎక్కువగా నేరాలు జరిగే నగరాల్లో బ్రెజిల్‌లోని రియో డీ జెనీరో కూడా ఒకటి. ఇక్కడ తరచూ షూటౌట్స్ జరుగుతూ ఉంటాయి. పోలీసు కాల్పుల్లో చనిపోయే వారి సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ మానవహక్కుల వేదిక కూడా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో కొన్ని ‘పోలీసు హత్య’లుగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

బ్రెజిల్‌లో షూటౌట్ వీడియో

First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...