ఈ ప్రపంచంలో ఈమెకు మించిన సైకో ఉండరమో.. ! చూసేందుకు చాలా అమాయకంగా.. అందంగా ఉన్నప్పటికీ... క్రూరాతి క్రూరమైన నరహంతకురాలు. సినిమాల్లో చూపించే సైకో కంటే భయకరమైన మనస్తత్వం ఈమెది. వన్య మృగాలు..రాక్షసులు కూడా.. ఈమె కంటే తక్కువే. ఎందుకంటే.. గర్భంతో ఉన్న తన స్నేహితురాలిని దారుణంగా కొట్టి చంపేసింది. అంతటితో ఆగక కత్తితో పొట్టను చీల్చి బిడ్డను బయటకు తీసింది. శవాన్ని విసిసేరి ఆ పాపను ఎత్తుకెళ్లింది. బ్రెజిల్‌లో గత ఏడాది ఈ ఘోరమైన ఘటన జరిగింది. దాదాపు 17 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఆ నర హంతకురాలికి శిక్షపడింది. 57 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పులు వెలువరించింది.
అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం... బ్రెజిల్‌లోని కేన్‌లిన్హా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల ఫ్లావియా గాడినో మార్ఫా, 27 ఏళ్ల రోజల్బా మారియా గ్రిమ్ స్నేహితులు. గత ఏడాది ఆగస్టులో మార్ఫా 9 నెలల నిండు గర్భిణీ. ఐతే బేబీ షవర్ ఫొటో షూట్ పేరిట మార్ఫాను ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లింది రోజల్బా బ్రిమ్. అక్కడ ఇటుక బట్టీలు తప్ప ఇంకేం లేవు. పక్కా స్కెచ్‌తో మార్ఫాను తీసుకెళ్లిన గ్రిమ్.. ఆమె అంతే పక్కాగా హత్య చేసింది. ఇటుకతో తలపై మోది చంపేసింది. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న కత్తితో మార్ఫా కడుపును చీల్చింది. ఆమె గర్భం నుంచి శిశువును బయటకు తీసి..ఆ తర్వాత డెడ్‌బాడీని మాయం చేసింది. అనంతరం పాప తీసుకొని పారిపోయింది.
ఆవును పెళ్లి చేసుకున్న వృద్ధురాలు.. నా భర్త పునర్జన్మ ఎత్తాడు.. మళ్లీ ఒక్కటయ్యాం..
అదే రోజు రాత్రి తన భాగస్వామితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది మారియా గ్రిమ్. అక్కడ మహానటికి మించి నటనతో అదరగొట్టింది. తాను ఇప్పుడే ఇంట్లో బిడ్డకు జన్మనిచ్చానని, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చినట్లు చెప్పింది. ఈ విషయం ఆమె భర్తకు కూడా తెలియదు. దాంతో అతడు నిజమేనని నమ్మేశాడు. కానీ డాక్టర్లకు ఏదో తేడా కొట్టింది. గ్రిమ్ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా అనిపించకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేనికి పొంతన లేకపోడంతో తమ దైన శైలిలో విచారించారు. అప్పుడు నిజం కక్కింది మారియా గ్రిమ్. తన ఫ్రెండ్‌ని చంపేసి, కడుపును చీల్చి, బిడ్డను బయటకు తీసినట్లు ఒప్పుకుంది.
Omicron: వణికిస్తున్న ఒమిక్రాన్.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు
గర్భంతో ఉన్నట్లు యాక్టింగ్:
మారియా గ్రిమ్‌కు పిల్లలు పుట్టడం లేదు. కానీ గర్భం దాల్చినట్లుగా తన భాగస్వామిని నమ్మించింది. కడుపు ఎత్తుగా కనిపించేలా లోపల పిల్లోను ఉంచి, గర్భం దాల్చినట్లుగా చెప్పేది. అది నిజమే అని అందరూ అనుకున్నారు. అంతేకాదు తాను గర్భంతో ఉన్నట్లుగా ఫొటోలు దిగి ఇన్‌స్ట్రగ్రామ్‌లో షేర్ చేసేది మారియా గ్రిమ్. గర్భంతో ఉన్న మహిళలు ఎలా నడుస్తారు? ఎలా ప్రవర్తిస్తారు? అనే అంశాలను ఆన్‌లైన్‌లో వెతికి నేర్చుకుంది. మారియా గ్రిమ్ భాగస్వామి అప్పుడప్పుడూ మాత్రమే ఈమెను కలిసేవారు. అందుకే అది ఉత్తుత్తి గర్భమని గుర్తించలేకపోయారు.
న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ.. ప్రకటించిన ఆ రాష్ట్ర గవర్నర్.. ఎందుకంటే
ఐతే పోలీసుల విచారణలో మారియా గ్రిమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ఫ్రెండ్ గాడినో మార్ఫాను చూస్తే అసూయ కలిగేదని చెప్పింది. తనకు పిల్లలు కలగడం లేదన్న కోపంతో.. ఆమెను చంపేసి, బిడ్డను ఎత్తుకెళ్లినట్లు నేరాన్ని అంగీకరించిది. పొట్టను కోసి బిడ్డను ఎలా బయటకు తీయాలో ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్నానని చెప్పడంతో.. పోలీసులు తిన్నారు. ఆమెకు వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను కోర్టుకు అందించడంతో నేరం రుజుయింది. ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత మారియా గ్రిమ్‌కు జైలు శిక్షపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, Crime, Crime news, Murder