పామును చంపిన కుక్క.. యజమాని ప్రాణాలు కాపాడి.. తాను ప్రాణాలొదిలి..

దాన్ని చూసి పప్పీ మొరగడం ప్రారంభించింది. నటరాజన్‌ను పాము కాటేయబోయింది. దీంతో అతడు ఒక అడుగు వెనక్కి వేయగా, పప్పీ ఆ పాము పైకి దూకి దానితో పోరాడి చంపేసింది.

news18-telugu
Updated: April 29, 2019, 2:00 PM IST
పామును చంపిన కుక్క.. యజమాని ప్రాణాలు కాపాడి.. తాను ప్రాణాలొదిలి..
పామును చంపిన శునకం
news18-telugu
Updated: April 29, 2019, 2:00 PM IST
మనిషిది, కుక్కది వేల ఏళ్ల బంధం.. అన్ని జంతువుల్లోకెల్లా మనిషికి త్వరగా దగ్గరయ్యేది శునకమే. అది విశ్వాసానికి మారు పేరు. ఒక్క సారి కాదు ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. అన్నం పెట్టి చేరదీస్తే.. జీవితాంతం మనతోనే ఉంటుంది. అవసరమైతే తన ప్రాణాలను కూడా అర్పించేందుకు సిద్ధపడుతుంది. తమిళనాడులోని తంజావూరులో చోటుచేసుకున్న ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. తన యజమానిని కాపాడేందుకు పాముతో పోరాడిందో శునకం. అయితే, చివరికి పాము విషం శరీరమంతా పాకి ప్రాణాలు విడిచింది.

పప్పీతో యజమాని


వెంగరాయన్ కుడికాడుకు చెందిన నటరాజన్(50) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. అతడు ఓ కుక్కకు పప్పీ అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా దాన్ని తనవెంటే తీసుకెళ్లే వాడు. రోజూలాగే దాన్ని శనివారం ఉదయం పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ తాచుపాము నటరాజన్‌ మీదకి దూసుకువచ్చింది. దాన్ని చూసి పప్పీ మొరగడం ప్రారంభించింది. నటరాజన్‌ను పాము కాటేయబోయింది. దీంతో అతడు ఒక అడుగు వెనక్కి వేయగా, పప్పీ ఆ పాము పైకి దూకి దానితో పోరాడి చంపేసింది. ఈ క్రమంలో పాముకాటుకు గురైన పప్పీ.. అక్కడికక్కడే చనిపోయింది.

నాలుగేళ్లుగా ఆ శునకాన్ని పెంచుకుంటున్నానని, కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసేవాళ్లమని నటరాజన్ తెలిపాడు. పప్పీ చనిపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది తనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదని, అది లేకపోవడం తనకు తీరని లోటని చెప్పాడు.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...