(K.Veeranna,News18,Medak)
ప్రేమ అనే ఒక్క పేరుతో అమ్మాయిలకు దగ్గరవుతున్నాయి యువకులు. వాళ్లకు నచ్చే మాటలు నాలుగు చెప్పడం...మెల్లిగా తమ దారిలోకి తెచ్చుకోవడం చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటా అని చెబుతూనే హద్దులు దాటేస్తున్నారు. అమ్మాయిలతో శారీరక వ్యామోహాన్ని తీర్చుకుంటున్నారు. ఫలితంగా పెళ్లి కాకుండా గర్భవతి(Pregnant)ని చేసి గుట్టుచప్పుడు కాకుండా దాన్ని తొలగించేందుకు చివరకు ఆమె ప్రాణాలతోనే చెలగాటమాడుతన్నారు. సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో ఓ మైనర్ బాలిక(Minor girl)పట్ల 21సంవత్సరాల యువకుడు ఇదే తరహాలో మోసం చేసి చివరకు ఆమెను చావు-బతుకుల మధ్యకు తీసుకెళ్లాడు.
ప్రేమ పేరుతో కక్కూర్తి..
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడి మాటలు నమ్మిన అమ్మాయి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడాలని చూసేందుకు ప్రియుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నర్సాపూర్ మండలంలోని తండాకు చెందిన 21సంవత్సరాల శత్రునాయక్ అదే తండాకు చెందిన 15ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకొని శారీరకంగా దగ్గరయ్యాడు. అమ్మాయికి పూర్తిగా తెలిసి తెలియని వయసును అడ్డుపెట్టుకొని తన కోరికను తీర్చుకున్నాడు.
మైనర్ ప్రాణాలతో చెలగాటం..
అమ్మాయితో పలుమార్లు శారీరకంగా కలవడంతో ఆమె గర్భవతి అయింది. విషయం మూడో కంటికి తెలియకుండా ఉండాలని శత్రునాయక్ ఐదు నెలల గర్భవతిగా ఉన్న అమ్మాయికి టాబ్లెట్లు వేస్తే గర్భం పోతుందని అబార్షన్ చేయించే అవసరం ఉండదని భావించాడు. అయితే అమ్మాయి వయసు 15సంవత్సరాలే కావడంతో టాబ్లెట్లు వికటించి అధిక రక్తస్త్రావం అయింది. పరిస్థితి సీరియస్‌గా మారడంతో కుటుంబసభ్యులు ఆమెను బుధవారం సాయంత్రం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితురాలి పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.అక్కడి వైద్యులు బాధితురాలికి అబార్షన్ చేశారు. ప్రస్తుతం ఆమె హెల్త్ కండీషన్‌పై ఏమీ చెప్పలేదని డాక్టర్లు తెలిపారు.
వదిలిపెట్టకండి..
మైనర్ బాలికను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని ప్రాణాల మీదకు తెచ్చిన శత్రునాయక్‌పై ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.యువకుడ్ని పిలిపించి పూర్తి వివరాలు అడుగుతున్నారు. గర్భవతిని చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.