మరో దిశ...ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి..ముగ్గురు కీచకుల గ్యాంగ్ రేప్...

బాధిత యువతితో సరదాగా సెలవు రోజు సినిమాకు వెళదామని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అన్నప్పటికీ, చివరకు ఒప్పుకుంది. దీంతో ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై సినిమాకు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి వెళుతుండగా, దుర్బుద్ధితో ఉన్న సుదేష్ ఒక నిర్మానుష్య ప్రదేశంలో ద్విచక్రవాహనం ఆపాడు.

news18-telugu
Updated: December 2, 2019, 9:08 PM IST
మరో దిశ...ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి..ముగ్గురు కీచకుల గ్యాంగ్ రేప్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
స్నేహం, ప్రేమ ముసుగులో యువతిని నమ్మించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు కీచకులు గ్యాంగ్ రేప్చ చేసిన ఘటన చత్తీస్ గడ్ లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాయ్‌పూర్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో బాధితురాలు ఉద్యోగం చేస్తుంది. అయితే అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మరో యువకుడు సుధేష్ (పేరు మార్పు) ప్రేమ పేరుతో ఆమె పై వలవిసిరాడు. రాయ్‌పూర్ లోని తెలిబంధా ప్రాంతానికి చెందిన ఆ యువకుడు కొంత కాలం తర్వాత కంపెనీ నుంచి ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. అయినప్పటికీ బాధితురాలిని ప్రేమపేరుతో కాంటాక్ట్ చేస్తూనే ఉండేవాడు. ఈ క్రమంలో గత వారం బాధిత యువతితో సరదాగా సెలవు రోజు సినిమాకు వెళదామని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అన్నప్పటికీ, చివరకు ఒప్పుకుంది. దీంతో ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై సినిమాకు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి వెళుతుండగా, దుర్బుద్ధితో ఉన్న సుదేష్ ఒక నిర్మానుష్య ప్రదేశంలో ద్విచక్రవాహనం ఆపాడు. అక్కడే కాపుకాచిన ఇద్దరు స్నేహితులకు సైగ చేశాడు. ముగ్గురు కలిసి యువతిపై లైంగిక దాడి చేశారు.

అనంతరం ఆమెను గాయపరిచి ఖాళీ బంగళా వద్ద వదిలేసి పారిపోయారు. అయితే బాధిత యువతిని గుర్తించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
First published: December 2, 2019, 8:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading