BOYFRIEND LOOT GIRLFRIEND AFTER HE KNOWS SHE HAVING AFFAIR WITH ANOTHER ONE ALSO IN BANGALORE HSN
మరో కుర్రాడితోనూ లవ్.. ఓ యువతి డబుల్ గేమ్.. తగిన శాస్తి చేయాలని ప్రియుడు పక్కా స్కెచ్.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనీ, మరో వ్యక్తితో తిరుగుతోందని ఆ ప్రియుడికి తెలిసింది. దీంతో పక్కాగా స్కెచ్ వేసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి మాటు వేసి ఓ రోజు తన ప్లాన్ ను అమలు చేశాడు.
సాధారణంగా ప్రేయసి మోసం చేస్తే ఆత్మహత్యకు పాల్పడిన ప్రియుడికి సంబంధించిన వార్తలను మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. ప్రియుడు మోసం చేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ప్రియురాళ్ల సంగతి విని ఉంటారు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో తిరుగుతోందని తెలిసి ఆగ్రహంతో ఆమెనే కడతేర్చిన ఘటనలను విని ఉంటారు. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనీ, మరో వ్యక్తితో తిరుగుతోందని ఆ ప్రియుడికి తెలిసింది. దీంతో పక్కాగా స్కెచ్ వేసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి మాటు వేసి ఓ రోజు తన ప్లాన్ ను అమలు చేశాడు. ఈ ఘటన జరిగిన షాక్ నుంచి తేరుకుని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తే ప్రియుడే ఈ ఘటనకు సూత్రధారి అని తెలిసి ఆ ప్రేయసి అవాక్కయ్యింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చెందిన జాకీర్ హుసేన్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. చాలా కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి వేరే వ్యక్తితో కలిసి తిరుగుతోందని జాకీర్ ఇటీవల చూశాడు. ఆ యువతి తమ ఇద్దరితోనూ డబుల్ గేమ్ ఆడుతోందని గ్రహించాడు. ఆమెపై కోపం పెంచుకున్నాడు. నిలదీస్తే లాభం లేదనీ, తగిన శాస్తి చేయాలనుకున్నాడు. అందుకోసం ఓ నిర్ణయానికి వచ్చేసి, పక్కా ప్లాన్ గీశాడు.
మార్చి 13వ తారీఖున తన ఇద్దరు స్నేహితులతో కలిసి ముసుగులు వేసుకుని చంద్రలేఔట్ భైరవేశ్వర్ నగర్ వద్ద ఆ యవతిని అడ్డగించారు. ఆమెను బెదిరించి దాదాపు రూ.4 లక్షలకు పైగానే విలువ చేసే 100 గ్రాముల బంగారు నగలను చోరీ చేశాడు. ఆ తర్వాత వాళ్లు అక్కడి నుంచి పరారయ్యాడు. తనను ముగ్గురు దుండగులు అడ్డగించి నగలను దోచుకున్నారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేసి ఎట్టకేలకు ఆ ముగ్గురిని పట్టేశారు. అయితే అందులో తన ప్రియుడు ఉండటంతో ఆమె అతడిని నిలదీసింది. ‘మరో కుర్రాడితో తిరుగుతూ నాతో డబుల్ గేమ్ ఆడావు. నన్ను మోసం చేశావు. అందుకే నీకు తగిన శాస్తి చేద్దామని ఇలా చేశా’ అంటూ ఆ ప్రియుడు చెప్పుకొచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.