Home /News /crime /

BOYFRIEND INFORMS HUSBAND ABOUT HIS WIFE AFFAIR AFTER THE YOUNG WOMAN TAKEN THESE DECISION SSR

HouseWife: ఈమె భర్తకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది.. అది ఎవరు పంపారో చూసి ఈమె షాక్.. చివరికి..

గోపిక (ఫైల్ ఫొటో)

గోపిక (ఫైల్ ఫొటో)

కేరళలోని వెల్లరాడలో ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. తొలుత భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ కేసు విచారణలో ఊహించని వ్యవహారం బయటకొచ్చింది.

  తిరువనంతపురం: కేరళలోని వెల్లరాడలో ఓ వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. తొలుత భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించినప్పటికీ కేసు విచారణలో ఊహించని వ్యవహారం బయటకొచ్చింది. ఆమె ప్రియుడు తమ వివాహేతర సంబంధం గురించి వాట్సాప్‌లో సంభాషణలతో కూడిన స్క్రీన్‌షాట్‌తో పాటు చనువుగా ఉన్న ఫొటోలను ఆమె భర్తకు పంపాడు. దీంతో.. తాను ఎంతగానో నమ్మిన ప్రియుడు ఇలా చేయడంతో తీవ్ర మనస్తాపంతో సదరు వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

  ఇది కూడా చదవండి: Husband: ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యను ఇంత ప్రేమగా చూసుకుంటున్న భర్తకు ఇలాంటి పరిస్థితా..

  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోపిక(29), షెర్లిన్ ఫిలిప్ భార్యాభర్తలు. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. భర్త, బిడ్డను సంతోషంగా చూసుకుంటూ గడపాల్సిన గోపిక బుద్ధి పెడతోవ పట్టింది. విష్ణు అనే వ్యక్తితో గోపికకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. గత నాలుగేళ్లుగా ఇద్దరూ ఆమె భర్తకు తెలియకుండా సీక్రెట్ అఫైర్ కొనసాగించారు.

  ఇది కూడా చదవండి: Lovers: పదేళ్ల ప్రేమకు ఇదేం ముగింపు.. ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందో తెలిస్తే..

  గోపిక పలు సందర్భాల్లో విష్ణుకు డబ్బులు కూడా ఇచ్చింది. ఇటీవల విష్ణు, గోపిక మధ్య మనస్పర్థలు వచ్చాయి. తన దారి తాను చూసుకుంటానని గోపికకు విష్ణు తెగేసి చెప్పాడు. అలా ఎలా కుదురుతుందని, పెళ్లి చేసుకుంటావని మాటిస్తేనే ఇన్నాళ్లూ కలిసి ఉన్నానని.. ఇప్పుడిలా అన్యాయం చేయవద్దని గోపిక బతిమాలింది. పెళ్లి చేసుకునేది లేదని, ఎక్కువగా మాట్లాడితే మీ ఆయనకు ఈ విషయం చెప్తానని విష్ణు గోపికను బెదిరించాడు. అంతటితో ఆగలేదు. చివరకు అన్నంత పని చేశాడు. గోపిక భర్తకు అతని భార్య తనతో ఎంత చనువుగా ఉందో తెలియజెప్పేలా సంభాషణలను, ఫొటోలను విష్ణు వాట్సాప్ చేశాడు. అవి చూసిన గోపిక భర్త ఫిలిప్ ఇదేంటని భార్యను నిలదీశాడు. ఆ ఫొటోలు భర్త వాట్సాప్‌కు విష్ణు పంపిన విషయం తెలిసి ఆమె షాకయింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపంతో గోపిక ఆమె ప్రియుడు విష్ణుకు ఇంట్లో భర్త లేని సమయంలో వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పింది.

  ఇది కూడా చదవండి: Shocking Incident: కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడు రోజూ ఆమె కోసం ఇంటికొస్తున్నాడని..

  ఆమె చనిపోతే వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందని భావించిన విష్ణు అలా చేయవద్దని, తాను వస్తున్నానని, మాట్లాడదామని చెప్పి వెంటనే గోపిక ఇంటికి వెళ్లాడు. అయితే.. విష్ణు వెళ్లే సమయానికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గోపికను విష్ణు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తేల్చి చెప్పడంతో హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. హాస్పిటల్ సిబ్బంది అతని తీరుపై అనుమానం వచ్చి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విష్ణుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గోపిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త, మూడేళ్ల బాబు గురించి ఆలోచించకుండా క్షణిక సుఖాల మోజులో పడి వివాహేతర సంబంధం కొనసాగించిన గోపిక జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసింది. వివాహేతర సంబంధాలు అనర్థాలకు దారితీస్తాయని ఇలాంటి ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు రోజూ వెలుగుచూస్తుండటం శోచనీయం.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Extra marital affair, Husband, Kerala, Wife

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు