హోమ్ /వార్తలు /క్రైమ్ /

Extra marital affair : ఆమెతో ఆరేళ్లు కలిసున్నాడు .. దూరం పెట్టగానే అనుమానంతో ఏం చేశాడో తెలుసా..?

Extra marital affair : ఆమెతో ఆరేళ్లు కలిసున్నాడు .. దూరం పెట్టగానే అనుమానంతో ఏం చేశాడో తెలుసా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extra marital affair: చేయకూడని తప్పు చేసినందుకు ఊహించని దారుణం జరిగింది. భర్తను వదిలిపెట్టి మరో వ్యక్తితో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పరిస్థితి చివరకు ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Sangareddy (Sangareddi), India

  (K.Veeranna,News18,Medak)

  వివాహేతర సంబంధాలు మొటల్లో సాఫీగా ఉన్నట్లే కనిపిస్తాయి. కొంత కాలం గడిచిన తర్వాత వాటి వల్ల తలెత్తే పరిణామాలు ప్రాణాల మీదకు తెస్తాయి. సమాజంలో పరువు, ప్రతిష్టలను బజారుకీడుస్తాయి. సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో కూడా ఇలాంటి చేదుఅనుభవమే ఓ మహిళకు ఆలస్యంగా తెలిసింది. చేయకూడని తప్పు చేసినందుకు ఊహించని దారుణం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru)మండలం ఇస్నాపూర్‌(Isnapur)గ్రామానికి చెందిన లక్ష్మీ(Lakshmi)అనే 36సంవత్సరాల మహిళ ఆరేళ్ల క్రితమే భర్తను వదిలి పిల్లతో విడిగా ఉంటోంది. ఈక్రమంలోనే ఆమెకు రెండో వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

  Crime news : వివాహితకు మత్తు మందిచ్చారు .. ఆపై ఏం చేశారో తెలుసా..?

  నమ్మినోడే నరికాడు..

  పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన సతీశ్ అనే ఆటో డ్రైవర్‌తో సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన లక్ష్మీతో పరిచయం ఏర్పడింది. భర్తను వదిలి ఉంటున్న లక్ష్మీతో సతీష్‌ చనువు పెంచుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య ఆ అనాధికార బంధం కొనసాగుతూ వస్తోంది. అయితే ఆరు నెలల క్రితం లక్ష్మీ తన పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని వాళ్లకు తెలిస్తే బాగుండని చెప్పి సతీష్‌ని దూరం పెడుతూ వచ్చింది. కలిసి ఉందామని సతీష్ కోరినప్పటికి ఆమె ఒప్పుకోకుండా పెద్దల సమక్షంలో విడిగా ఉండే విధంగా ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు.

  అనుమానంతోనే అఘాయిత్యం..

  ఆరేళ్లుగా తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తనను దూరం పెట్టిందనే కోపంతో పాటు ఆమె పని చేస్తున్న కంపెనీలోనే మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందని అనుమానించాడు సతీష్. అదే ఆక్రోశంతో శనివారం సాయంత్రం సతీశ్ ఆటో తీసుకొని లక్ష్మి పనిచేసే కంపెనీకి వెళ్లాడు. డ్యూటీ ముగియగానే ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చిన లక్షీపై తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాలు కట్ చేసే కత్తితో దాడి చేశాడు. కత్తితో పొట్టలో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే లక్ష్మిని చికిత్స కోసం ఇస్నాపూర్‌లోని కాకతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో బాధితురాలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

  Telangana : పేద, ప్రతిభావంతులైన విద్యార్ధులకు సాయం .. పూర్వ విద్యార్ధులు చేస్తున్న గొప్ప పనేంటో తెలుసా..?

  ఇద్దరూ వలస జీవులే..

  కర్నాటక రాష్ట్రం బాల్కీ గ్రామానికి చెందిన సంతీస్ బతుకు దెరువు కోసం పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. బాధితురాలు లక్ష్మీ కూడా భర్తను వదిలిపెట్టి ఇస్నాపూర్‌లో నివాసముంటూ ఇస్నాపూర్ పరిశ్రమికవాడలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే మహిళపై కత్తితో దాడి చేసి పారిపోయిన సతీష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Extra marital affair, Sangareddy, Telangana crime news

  ఉత్తమ కథలు