Boy Stuck Inside Borewell : పూడ్చకుండా వదిలేసిన బోరుబావులు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. ఇదివరకు ఎన్ని ఘటనలు జరిగినా, ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మాత్రం మార్పురావడం లేదు. నీటి కోసం బోర్లు వేయడం..వాటిలో నీరు రాకపోవడంతో అలాగే పూడ్చకుండా వదిలేయడం పరిపాటిగా మారింది. తాజాగా మద్యప్రదేశ్ లో ఓ పొలం యజమాని ఇలా పూడ్చకుండా వదిలేసిన బోరుబావిలో 8ఏళ్ల బాలుడు పడ్డాడు. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండ్విలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండ్వి గ్రామంలో నానక్ చౌహాన్ అనే రైతు రెండేళ్ల క్రితం తన పొలంలో బోర్ వేశారు. అందులో నీళ్లు అడుగంటిపోవడంతో అది నిరుపయోగంగా ఉంది. దాన్ని మూయలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో తన్మయ్ దియావర్ అనే బాలుడు.. పొలంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. రు. తమకు సమాచారం అందింన వెంటనే అక్కడిక చేరుకున్నామని.. సహాయక చర్యలు ప్రారంభించామని, మట్టి తవ్వే యంత్రాలను తెప్పించామని, బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని అత్నర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ సోని తెలిపారు.
ప్రపంచంలోనే 10 విచిత్రమైన విమానయాన సంస్థలు..బికినీ ఎయిర్ హోస్టెస్లు కూడా!
బాలుడిని క్షేమంగా వెలికితీసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. జేసీబీతో బోరుబావికి సమానంగా అధికారులు గుంతను తవ్విస్తున్నారు. బాలుడుకి ఆక్సిజన్ అందటానికి బోరుబావిలోకి సిబ్బంది ఆక్సిజన్ పైపును పంపారు. చిన్నారి బోరుబావిలో దాదాపు 60 అడుగుల లోతులో స్మృహ తప్పి పడిపోయాడని అనుమానిస్తున్నారు. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతన్నాయి. కాగా, బాలుడు ఎంత లోతులో ఉన్నాడని విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. బోరుబావిని కప్పి ఉంచానని, అందులో బాలుడు ఎలా పడిపోయాడో తనకు అర్ధమవడం లేదని నానక్ చౌహాన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Borewell, Crime news, Madhya pradesh