యువకుడిపై మహిళ అత్యాచారం...ఐస్‌క్రీమ్ ఇస్తానని ఇంట్లోకి పిలిచి...

గత వారం జమున ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజును తమ ఇంటికి రమ్మని పిలిచింది. తన పుట్టిన రోజు అని చెప్పి, స్వీటు తిని వెళ్లమని ఆహ్వానించింది. అయితే జమున దుర్బుద్ధితో ఐస్‌క్రీ‌మ్‌లో డ్రగ్స్ కలిపింది. దీంతో రాజు పరిస్థితి మతి స్థిమితం కోల్పోయినట్లు అయ్యింది.

news18-telugu
Updated: January 29, 2020, 6:25 PM IST
యువకుడిపై మహిళ అత్యాచారం...ఐస్‌క్రీమ్ ఇస్తానని ఇంట్లోకి పిలిచి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
తన కోరిక తీర్చేలేదనే కసితో ఓ యువకుడిపై మహిళ లైంగిక దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన రాజు(పేరు మార్పు) స్థానికంగా ఉన్న కళాశాలలో  వృత్తి విద్యా కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో రాజు తన కళాశాలకు దగ్గరగా ఉన్న ఇంటి వద్దకు మారాడు. ఇంటి పక్కనే ఉన్న ఓ కుటుంబంతో అతడు కాస్త సన్నిహితంగా మారాడు. పక్క ఇంట్లో ఉన్న జమున (పేరు మార్పు) తొలుత రాజుతో చాలా బాగా ఉండేది. రాజును తమ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చూసేది. దీంతో రాజు కూడా చాలా చనువుగా ఉండేవాడు. కాగా కొంత కాలం గడిచిన తర్వాత జమున నడవడికలో మార్పు వచ్చింది. ఆమె రాజుతో వివాహేతర బంధం పెట్టుకోవాలని ప్రయత్నం చేసింది. ఇందు కోసం పక్కా ప్రణాళిక వేసుకుంది. రాజును తన ముగ్గులోకి దింపేందుకు అతడిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అంతేకాదు వివాహేతర సంబంధం పెట్టుకుందామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఇద్దరి మధ్య వయస్సు రీత్యా అంతరం ఉండటంతో, రాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అయినప్పటికీ జమున తన ప్రయత్నం మానలేదు. అతడిని పలుమార్లు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి పిలిచి తన కోరిక తీర్చమని రెచ్చగొట్టేది. అయినా అతడు ఆమెను తిరస్కరించేవాడు.  దీంతో అదను కోసం ఎదురు చూసిన జమున అతడిని ఇకపై ఇబ్బంది పెట్టనని చెప్పింది. దీంతో ఆమె మాటలను నమ్మిన రాజు, సరేనని జమున కుటుంబంతో అంతకు ముందులాగానే సన్నిహితంగా ఉండటం ప్రారంభించాడు. ఆమె కుటుంబ సభ్యులతో జమున తనతో ప్రవర్తించిన తీరును ఎక్కడా బయటపెట్టకుండా ఉండటంతో ఆమె ఊపిరిపీల్చుకుంది.

అయినప్పటికీ కుక్కతోక వంకర అన్న తరహాలో జమున ప్రవర్తించింది. గత వారం జమున ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజును తమ ఇంటికి రమ్మని పిలిచింది. తన పుట్టిన రోజు అని చెప్పి, స్వీటు, ఐస్ క్రీమ్ తిని వెళ్లమని ఆహ్వానించింది. అయితే జమున దుర్బుద్ధితో ఐస్‌క్రీమ్ లో డ్రగ్స్ కలిపింది. దీంతో రాజు పరిస్థితి మతి స్థిమితం కోల్పోయినట్లు అయ్యింది. అంతే అతడిని బెడ్రూంలోకి తీసుకెళ్లి, మత్తు మాయలో అతడిని లైంగికంగా అనుభవించింది. మందు ప్రభావంతో రాజుకు తనతో ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం మత్తులో నుంచి బయటకు వచ్చిన రాజుకు అసలు సంగతి అర్థమైంది. దీంతో లబోదిబోమన్నాడు.

అయితే జమున మాత్రం ఈ విషయం బయటకు చెబితే ప్రాణాలకు ప్రమాదమని, తనపై అత్యాచారం చేశావని తన భర్తకు చెబుతానని బెదిరించింది. అంతేకాదు తన సోదరిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అందుకు ససేమిరా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించింది. అయితే జరిగిన లైంగిక దాడితో కలత చెందిన రాజు వెంటనే పోలీసులను సంప్రదించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇరువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే యువకుడు మైనర్ కావడంతో కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.

First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు