Kidnap: విషాదాంతమైన మరో బాలుడి కిడ్నాప్ కథ.. మహబూబాబాద్ ఘటన మరవక ముందే మరో దారుణం

మహబూబాబాద్ జిల్లాలో బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఐదేళ్ల బాలుడిని ఓ దుర్మార్గుడు కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపేశాడు.

news18-telugu
Updated: October 26, 2020, 5:18 PM IST
Kidnap: విషాదాంతమైన మరో బాలుడి కిడ్నాప్ కథ.. మహబూబాబాద్ ఘటన మరవక ముందే మరో దారుణం
బాలుడి చిత్రం
  • Share this:
మహబూబాబాద్ జిల్లాలో బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య ఘటన మరవక ముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఐదేళ్ల బాలుడిని ఓ దుర్మార్గుడు కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపేశాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు రూ. 15 లక్షలు ఇస్తే వదిలేస్తానంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని విచారించగా ఆ బాలుడిని చంపేసినట్లు అంగీకరించాడు. వివరాల్లోకి వెళ్లే.. మేడ్చల్ జిల్లా శామీర్ పేటకు చెందిన సయ్యద్ ఉసేన్, గౌజ్ బీ మూడో కుమారుడు అథియాన్(5). ఆ బాలుడు స్థానిక ఓ ప్రైవేటు స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 15 వ తేదీ మధ్యాహ్నం అతడు కిడ్నాప్ కు గురయ్యాడు.

ఆడుకోవడానికి బయటకు వెళ్లిన కుమారుడు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానికంగా వెతికారు. ఎక్కడా ఆ చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధిత తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలుడి కోసం తీవ్రంగా గాలించారు. అయితే రూ. 15 లక్షలిస్తేనే మీ అబ్బాయిని విడిచిపెడతానంటూ ఓ వ్యక్తి బాధిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించాడు.

దీంతో పోలీసులు ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బాధితులు నివాసం ఉంటున్న మరో పోర్షన్ లో నివాసముండే బీహార్ కు చెందిన 25 ఏళ్ల సోన్ సోన్ ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ బాలుడిని చంపేసినట్లు అతడు విచారణలో ఒప్పుకున్నాడు. బాలుడి శవాన్ని పోలీసులకు చూపించాడు. చంపి 11 రోజులు కావడంతో శవం కుల్లిన స్థితిలోకి చేరిందని పోలీసులు తెలిపారు.
Published by: Nikhil Kumar S
First published: October 26, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading