నగ్నచిత్రాల కోసం బ్లాక్‌మెయిల్... యువతిని బెదిరించిన స్నేహితుడు...

Telangana Crime : స్నేహానికి ఎంతో గొప్ప అర్థముంది. పేరెంట్స్‌తో చెప్పుకోలేని విషయాల్ని స్నేహితులకు చెప్పుకుంటాం. అంతటి గొప్ప ఫ్రెండ్షిప్‌ని అడ్డం పెట్టుకొని... బ్లాక్‌మెయిల్‌కు తెరతీశాడు. చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 22, 2019, 11:38 AM IST
నగ్నచిత్రాల కోసం బ్లాక్‌మెయిల్... యువతిని బెదిరించిన స్నేహితుడు...
నిందితుడు రయనుద్దీన్
  • Share this:
నిజామాబాద్... సనత్‌నగర్‌కి చెందిన 19 ఏళ్ల మహ్మద్ రయనుద్దీన్... శంకర్‌పల్లిలోని ఓ కాలేజీలో BBA కోర్స్ చేస్తూ... హాస్టల్‌లో ఉంటున్నాడు. సరూర్‌నగర్‌కి చెందిన ఓ విద్యార్థిని వెంటపడ్డాడు. నీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఉంది అన్నాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పింది. అయినా వదల్లేదు. మాటిమాటికీ వెంటపడుతూ... నేనేమైనా ప్రేమించమన్నానా... ఫ్రెండ్షిప్పేగా చెయ్యమన్నాను. చెయ్యలేవా అంటూ అడగసాగాడు. అప్పటికీ ఆమె లొంగలేదు. నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ఓ రోజు... రివర్సయ్యాడు. పదే పదే అడుగుతుంటే లైట్ తీసుకుంటావా... నా సంగతి నీకు తెలీదు... స్నేహం చేస్తావా, చస్తావా అని కత్తితో బెదిరించాడు. దాంతో ఏం చెయ్యాలో తెలియక... సరే ఫ్రెండ్షిప్పే కదా అని ఒప్పుకుంది.

ఇక అప్పటి నుంచీ మనం ఫ్రెండ్స్... మన స్నేహానికి ఆకాశమే హద్దు. నిన్ను ఏమీ అనను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం... ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెబుతూ... మెల్లమెల్లగా ఆమెకు మరింత దగ్గరై... ఫొటోలు, సెల్ఫీలూ తీసుకున్నాడు. కొన్ని రోజులు ఇలా ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకున్నాక... కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఓ రోజు "నువ్వు ఏ డ్రెస్సులో ఉన్నా... అందంగానే ఉంటున్నావ్. డ్రెస్ లేకుండా ఎలా ఉంటావో చూడాలని ఉంది" అన్నాడు. "షటప్... జోక్స్ వెయ్యకు... ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు" అని చిన్నగా వార్నింగ్ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గలేదు. ఆ రోజు నుంచీ అదే టార్చర్. ఆ ఫొటోలు పంపు... అలాంటివి లేకపోతే... ఇంటికి వెళ్లి... ఇప్పుడు తీసుకొని... పంపు... నువ్వేం చేస్తావో నాకు తెలీదు... నీ పోర్న్ (నగ్న) ఫొటోలు నాకు పంపాలంతే... అన్నాడు. "నోర్ముయ్... ఇంకొక్క మాట మాట్లాడితే... మా పేరెంట్స్‌కి చెప్తాను" అంది... "చెప్పు... నేనూ చెప్తాను... నువ్వూ నేనూ లవర్స్ అనీ... ఇద్దరం కలిసి అంతా తిరిగామనీ, అన్నీ అయిపోయాయని చెబుతాను. మనిద్దరం కలిసి దిగిన సెల్ఫీలను చూపిస్తాను. అప్పుడు మీవాళ్లు కూడా నా మాటే నమ్ముతారు" అన్నాడు. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచీ ఏడుస్తూ వెళ్లిపోయింది.

మూడ్రోజుల తర్వాత ఆమె పేరెంట్స్‌తో కలిసి సినిమా హాల్‌కి వెళ్లింది. అప్పుడు ఆమెకు కాల్ చేశాడు. బాత్ రూంలోకి వెళ్లి... నగ్న సెల్ఫీలు తీసుకొని తనకు పంపమన్నాడు. లేదంటే... వెంటనే సెల్ఫీ ఫొటోలను ఆమె పేరెంట్స్‌కి పంపిస్తానన్నాడు. భయపడిన ఆమె... అతను చెప్పినట్లే చేసింది. అంతే... నగ్న చిత్రాలు చిక్కగానే... మరింత రెచ్చిపోయాడు.

"నేను చెప్పినట్లు చెయ్... నాతో హోటల్‌కి రా... ఎంజాయ్ చేద్దాం. లేదంటే... నీ నగ్న ఫొటోలను ఇంటర్నెట్‌లో పెడతాను. నీ మొబైల్ నంబర్ ఇస్తాను. అప్పుడు అందరూ నీకు కాల్ చేసి... రేటెంత అని అడుగుతారు" అని బెదిరించాడు.

ఎన్నాళ్లని భరిస్తుంది... ధైర్యం చేసి... విషయం మొత్తం ఇంట్లో వాళ్లకు చెప్పేసింది. తల్లిదండ్రులు మంచివాళ్లు కావడంతో... ఆమె అనుభవించిన వేదననూ, ఆమెకు కలిగిన బాధలనూ అర్థం చేసుకున్నారు. ఆప్యాయంగా హత్తుకొని... ఓదార్చారు. కొండంత ధైర్యం చెప్పారు. వాళ్లతో కలిసి... పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన ఆ యువతి... మహ్మద్ రయనుద్దీన్‌పై కేసు పెట్టింది. అదే సమయంలో... ఆమెకు కాల్ చేసిన రయనుద్దీన్... ఊరి చివర పొలాల్లోకి రమ్మన్నాడు. "లేదంటే... ఆ ఫొటోలు" అంటూ పాత పాటే పాడాడు. పోలీసులు చెప్పినట్లూ వింటూ... ఆమె సరే అంది. ఆ తర్వాత పోలీసులు... పొలాల దగ్గరకు వెళ్లి... రయనుద్దీన్‌ను పట్టుకున్నారు. అతని దగ్గరున్న రెండు సెల్‌ఫోన్లూ సీజ్ చేశారు. వాటిలో ఫొటోలను డిలీట్ చేశారు.

ఇదీ ఫ్రెండ్షిప్ పేరుతో ఓ కుర్రాడు చేసిన దుర్మార్గం. అమ్మాయిలూ... ఇలాంటి కొండెగాళ్లు అడుగడుగునా ఉంటున్నారు. బీ అలర్ట్.
Published by: Krishna Kumar N
First published: August 22, 2019, 11:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading