ప్రేయసిని చంపి... సూసైడ్ చేసుకోబోయిన ప్రియుడు... ఎక్కడ తేడా వచ్చింది?

Love and Murder : ప్రేమ కథలన్నీ విషాదం కావాల్సిందేనా... హత్యలు, ఆత్మహత్యలు జరగాల్సిందేనా... ఎందుకీ పరిస్థితి... తప్పు ఎవరిది?

Krishna Kumar N | news18-telugu
Updated: July 13, 2019, 11:38 AM IST
ప్రేయసిని చంపి... సూసైడ్ చేసుకోబోయిన ప్రియుడు... ఎక్కడ తేడా వచ్చింది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బెంగాల్‌లోని జన్‌షాలీలో జరిగిందీ ఘటన. రాగిణి... నరైన్... ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఏడాది పాటూ... పార్కులు, సినిమాలకు వెళ్లారు. వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని ఫ్రెండ్స్ అంతా అనుకున్నారు. అంతా బాగానే ఉంటే... ఈ కథలో విషాదం ఉండేది కాదేమో. మధ్యలో ఓ రోజు... నరైన్‌కి వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ఈ రోజు రాత్రికి నన్ను ముద్దులతో చంపేయ్ అని అందులో ఉంది. నరైన్, రాణిగి ఓ పార్కులో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో... ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు నరైన్. ఒకే సమయంలో అతనితోపాటూ... రాగిణి కూడా ఆ మెసేజ్ చదివింది. ఎవరా అమ్మాయి అని అడిగింది. తనకు తెలియదన్నాడు నరైన్. తెలియకుండా అలాంటి మెసేజ్ ఎలా పెడుతుంది అని అడిగింది. నిజంగానే తనకు తెలియదన్నాడు. తెలిసిన అమ్మాయి అయితే... తన నెంబర్... తన మొబైల్‌లో సేవ్ చేసి ఉండేది కదా అన్నాడు. రాంగ్ నంబర్, రాంగ్ మెసేజ్ అన్నాడు. అయినప్పటికీ రాగిణీ నమ్మలేదు. నన్ను పదే పదే ముద్దులు అడిగేవాడివి... నువ్వు నన్ను మోసం చేస్తున్నావ్ అంటూ అక్కడి నుంచీ కోపంగా వెళ్లిపోయింది.

ఇక అప్పటి నుంచీ రాగిణి, నరైన్ మధ్య మాటల యుద్ధమే. ప్రతి దానికీ ఇద్దరి మధ్యా గొడవలే. రోజురోజుకూ మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఓ రోజు కోపంలో రాగిణి... బ్రేకప్ చెప్పింది... తన పేరెంట్స్ చూపించే అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ముఖంపైనే చెప్పి వెళ్లిపోయింది. దాదాపు మూడేళ్లుగా ఆమెతో తిరిగిన నరైన్... తట్టుకోలేకపోయాడు. వేరే అబ్బాయితో ఆమెను కల్లో కూడా ఊహించలేకపోయాడు. తనను మోసం చేస్తోందనీ, కావాలనే తనను పక్కన పెట్టిందని అనుకున్నాడు. తనకు దక్కని రాగిణీ ఇంకెవరికీ దక్కకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు.

మార్కెట్‌కి వెళ్లి కొబ్బరి బోండాలు కోసం కత్తిని కొన్నాడు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్న రాగిణిని నడిరోడ్డుపై అడ్డుకొని... మెడపై కత్తితో గట్టిగా ఒక్కటిచ్చాడు. అంతే... కీలకమైన నరాలు తెగిపోవడంతో... విలవిలలాడుతూ రాగిణీ రక్తపు మడుగులో నేలపై పడింది. ఆమె గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆ దృశ్యాన్ని చూడలేక అక్కడి నుంచీ పారిపోయాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే... మధ్యలోనే ప్రాణాలు విడిచింది. రాగిణిని చంపిన నరైన్... తాను ఎంత పెద్ద తప్పు చేసిందీ తలచుకొని... తీవ్రంగా కుమిలిపోయాడు. ఆ వేదనలో... తన కాళ్లు రెండూ నరికేసుకున్నాడు. ఎడమచెయ్యిని కూడా నరుక్కున్నాడు. వెంటనే స్థానికులు అతన్ని విరిగిపడిన కాళ్లు, చెయ్యితో సహా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ జరుగుతోంది.

ఇలా ఓ పనికిమాలిన మెసేజ్... ఆ ప్రేమికుల జీవితంలో చిచ్చుపెట్టింది. బ్యూటీఫుల్ ప్రేమ కథను విషాదాంతం చేసింది.

First published: July 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>