Home /News /crime /

BOY FRIEND HAVING LOVE TRACK WITH ANOTHER GIRL THEN DEPRESSED GIRL FRIEND COMMITS SUICIDE SSR

Sad Ending: ఫొటోలకు మాత్రం ఈ రేంజ్‌లో ఫోజులిచ్చావ్.. చివరికి ఇలా చేశావేంటి బాబూ..!

చింటూ, అంజు

చింటూ, అంజు

జీవితంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి చేతిలో మోసపోతారు. కానీ.. మనం బాగా నమ్మిన వ్యక్తులు మోసం చేస్తే భరించలేం. బాగా నమ్మిన స్నేహితుడు మోసం చేస్తేనో.. ఎంతో ప్రాణంగా ప్రేమించిన లవర్ మోసం చేస్తేనో తీవ్ర మనస్తాపానికి లోనవుతుంటాం. ఈ భావోద్వేగాలు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యేవే.

ఇంకా చదవండి ...
    అలప్పుజ: జీవితంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి చేతిలో మోసపోతారు. కానీ.. మనం బాగా నమ్మిన వ్యక్తులు మోసం చేస్తే భరించలేం. బాగా నమ్మిన స్నేహితుడు మోసం చేస్తేనో.. ఎంతో ప్రాణంగా ప్రేమించిన లవర్ మోసం చేస్తేనో తీవ్ర మనస్తాపానికి లోనవుతుంటాం. ఈ భావోద్వేగాలు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యేవే. కానీ.. ఆ మోసాన్ని తలచుకుని బాధపడకుండా ఉన్నతంగా ఆలోచిస్తూ.. పాఠాలు, గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. ఆ ధైర్యం ఈరోజుల్లో చాలామందిలో కొరవడుతోంది. నమ్మిన వ్యక్తి మోసం చేశాడని చనిపోయేంత ధైర్యం చేస్తున్నారు గానీ బతికి చూపించాలని భావించడం లేదు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. తాను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి మరో యువతితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడన్న సంగతి తెలిసి ప్రేయసి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలప్పుజకు చెందిన చింటూ(23), అంజు(22) మధ్య కాలేజ్ డేస్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ మిగతా లవర్స్ మాదిరిగానే వీకెండ్‌లో బయట కలుస్తుండేవారు. సినిమాలకు, షికార్లకు వెళుతుండేవారు.

    ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్న ఇద్దరూ చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంజు అతనిని పూర్తిగా నమ్మిన ఈ తరుణంలో ఆమెకు ఓ చేదు నిజం తెలిసింది. చింటూ మరొక యువతితో కూడా ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తెలుసుకుంది. ఆమెతో చనువుగా కనిపించడం.. చింటూ ఫోన్‌లో ఆమెతో వాట్సాప్ సంభాషణలను అంజు గమనించింది. తాను ఒక మోసగాడిని పిచ్చిగా ప్రేమించానని అంజు తీవ్ర మనస్తాపానికి లోనైంది. కొన్ని రోజుల నుంచి ఇంట్లో కూడా ముభావంగా ఉంటోంది. కానీ.. మంగళవారం సాయంత్రం క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం జీవితాన్నే తలకిందులు చేసింది. ఇంట్లో తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

    ఇది కూడా చదవండి: Bank Employee: బ్యాంకులో ఉద్యోగం.. మంచి జీతం.. ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు.. ఇంతలోనే..

    చింటూ మరో యువతితో లవ్‌లో ఉన్నాడని.. తనను మోసం చేశాడని అతని సోదరికి అంజు చివరిగా వాట్సాప్‌లో మెసేజ్ పంపింది. ఆమె సూసైడ్ చేసుకున్న గదిలో డెత్ నోట్ కూడా లభ్యమైంది. తన చావుకు చింటూనే కారణమని.. నేను తనను ఎంతగానో ప్రేమించానని ఆ సూసైడ్ నోట్‌లో అంజు రాసింది. పోలీసులు చింటూను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. అంజుకు తన వ్యవహారం తెలియగానే చింటూ ఆమెకు ఫోన్ చేసి విసిగించాడని.. మానసికంగా హింసించాడని ఆమె కుటుంబం ఆరోపించింది. పోలీసులు అంజు కాల్ డేటాను, వాట్సాప్ సంభాషణలను పరిశీలిస్తున్నారు. చింటూపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Kerala, Lover cheating, Lovers, Lovers suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు