BOY FRIEND COMMITS SUICIDE HOURS BEFORE WEDDING GIRL FRIEND ATTEMPT SUICIDE IN HYDERABAD SK
Hyderabad: మరికొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు చేసిన ఘోరానికి వధువు కూడా అంత పనే చేసింది
ప్రతీకాత్మక చిత్రం
సోమవారం పెళ్లి దుస్తులు తెచ్చుకునేందుకు ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో విజయ్ ఒక్కడే రూమ్‌లో ఉన్నాడు. కాసేపటి తర్వాత ఆమెకు ఫోన్ చేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు
వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. చాలా రోజులుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకొని తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. పెళ్లికి రెండు రోజుల ముందు ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు మరణించాడని తెలిసి ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టాలపై పడుకొని ప్రాణాలను తీసుకునేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమెను కాపాడారు. హైదరాబాద్ (Hyderabad)లోని రాజేంద్రనగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కడప జిల్లా కొండాపురానికి చెందిన విజయ్ కుమార్ (40)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. రైల్వే డిపార్ట్మెంట్ (Indian Railways)లో స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే కొంత కాలంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. విజయ్‌కు ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని టప్పాచబుత్రకు చెందిన ఓ మహిళ పరిచయమయింది. భార్య నుంచి విడిపోయిన తర్వాత.. ఆమెకు చాలా దగ్గరయ్యాడు విజయ్. ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. రాజేంద్ర నగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ నెల 25న వివాహం చేసుకోవాలని నెలరోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో.. వారం రోజుల క్రితం విజయకుమార్ ఆ మహిళకు చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆమె టప్పాచబుత్రకి వెళ్లి పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు కేసును రాజేంద్ర నగర్ ఠాణాకు బదిలీ చేశారు.
కేసును దర్యాప్తున చేసిన పోలీసులు.. ఎట్టకేలకు విజయ్‌ని గుర్తించారు. ఇద్దరినీ ఆదివారం స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఇద్దరు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. సోమవారం పెళ్లి దుస్తులు తెచ్చుకునేందుకు ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో విజయ్ ఒక్కడే రూమ్‌లో ఉన్నాడు. కాసేపటి తర్వాత ఆమెకు ఫోన్ చేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ మాట వినేసరికి.. ఆమెకు గుండె ఆగినంత పనయింది. హుటాహుటిన ఇంటికి వెళ్లి వెళ్లింది. కానీ అప్పటికే విజయ్ మరణించాడు. విగతజీవిగా పడి ఉన్న కాబోయే భర్తను చూసి ఆ మహిళ షాక్‌లోకి వెళ్లిపోయింది. తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. ఖైరతాబాద్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని.. పట్టాలపై పడుకుంది. కానీ పోలీసులు ఆమెను గుర్తించి కాపాడారు. విజయ్ ఆత్మహత్య ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. అసలు అతడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడని తెలియాల్సి ఉంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.