• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BOY FRIEND BOOKED FOR PLANNING REVENGE ON A MAN WHO WAS THE MAIN REASON FOR HIS LOVE BREAKUP IN KARNATAKA HSN

సిటీలో ప్రియుడితో కనిపించిన యువతి.. ఆమె తల్లిదండ్రులకు చెప్పాడో వ్యక్తి.. చివరకు జరిగిందో ఊహించని ట్విస్ట్..!

సిటీలో ప్రియుడితో కనిపించిన యువతి.. ఆమె తల్లిదండ్రులకు చెప్పాడో వ్యక్తి.. చివరకు జరిగిందో ఊహించని ట్విస్ట్..!

నిందితుడు చెన్న బసప్ప

‘మీ అమ్మాయి ఫలానా అబ్బాయితో ఉండటాన్ని నేను చూశాను. బహుషా ప్రేమించుకుంటున్నారేమో.‘ అంటూ అసలు విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పాడా వ్యక్తి. ఇంకేముంది, వారి ప్రేమ వ్యవహారం కాస్తా బెడిసికొట్టింది. దీంతో..

  • Share this:
    ఆ కుర్రాడు తన గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. త్వరలోనే ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు కూడా. సిటీలో తన ప్రేయసితో కలిసి ఉన్న సమయంలో అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి వారిని చూశాడు. ‘మీ అమ్మాయి ఫలానా అబ్బాయితో ఉండటాన్ని నేను చూశాను. బహుషా ప్రేమించుకుంటున్నారేమో.‘ అంటూ అసలు విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పాడా వ్యక్తి. ఇంకేముంది, వారి ప్రేమ వ్యవహారం కాస్తా బెడిసికొట్టింది. కుటుంబసభ్యులు నచ్చజెప్పడంతో ఆ యువతి కాస్తా అతడికి దూరమయింది. అంతే, దీనికంతటికీ కారణమయిన వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడా కుర్రాడు. అతడిని జైలు పాలు చేయాలని ప్రయత్నించి, చివరకు తనే ఇరుక్కుపోయాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్ణాటక రాష్ట్రం కూడ్లిగి నగర పోలీస్ స్టేషన్ కు జనవరి 28వ తారీఖున ఓ ఫోన్ వచ్చింది. ‘బడేలడ గ్రామానికి చెందిన బసవరాజ్ అనే వ్యక్తి ఇంటిపై గంజాయి మొక్కలు ఉన్నాయి. అతడు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాడు’ అన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఆ గ్రామానికి వెళ్లి అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సమాచారం అందిన విధంగానే అతడి ఇంటిపై గంజాయి మొక్కలు దొరికాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలిసి బసవరాజ్ గ్రామస్తులు పోలీసులకు ఎదురుతిరిగారు. ‘అతడు చాలా మంచివాడు. గంజాయి వ్యాపారం అంటేనే అతడికి తెలియదు. మద్యం తాగే అలావాటు కూడా లేదు. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు. లేదా సమాచారం ఇచ్చిన వ్యక్తే గంజాయి మొక్కలను అతడి ఇంట్లో పెట్టి ఉంటాడు. ముందు అతడిని పట్టుకోండి. అప్పుడు అన్ని నిజాలు తెలుస్తాయి.‘ అంటూ స్థానికులు పోలీసులతో వాగ్వాదమాడారు. దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆరా తీశారు.
    ఇది కూడా చదవండి: బయటపడ్డ అసలు నిజం.. గంటకో కట్టుకథ చెబుతూ ముప్పతిప్పలు.. పోలీసులకు డౌట్ రాకుండా ప్రియుడిని భయ్యా అని పిలిస్తూ..

    దాదాపు 43 రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న చెన్న బసప్ప అనే యువకుడిని పోలీసులు ఎట్టకేలకు శనివారం అరెస్ట్ చేశారు. అతడెవరన్నది తెలిసి, అసలు జరిగిందేంటో గ్రామస్తులకు తెలిసొచ్చింది. చెన్న బసప్ప అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే తన ప్రేయసితో కలిసి సిటీలో ఉండగా బసవరాజ్ చూశాడు. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వ్యవహారం కాస్తా రభసగా మారి మొత్తానికి అతడి ప్రేమ పెటాకులు అయింది. బసవరాజ్ వల్లే తన ప్రేయసి దూరమయిందన్న కోపంతో చెన్న బసప్ప ఓ నిర్ణయానికి వచ్చాడు. అతడిని ఇబ్బందులకు గురి చేయాలనుకున్నాడు. కొన్ని గంజాయి మొక్కలను కొని, అతడి ఇంటిపై విసిరేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసిచెప్పాడు. చివరకు అతడే ఇరుక్కుపోయాడు.
    ఇది కూడా చదవండి: ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..
    Published by:Hasaan Kandula
    First published: