గర్ల్ ఫ్రెండ్‌తో టిక్ టాక్ వీడియో.. చెట్టుకు కట్టేసి కొట్టిన ‘పేరెంట్స్’

తన కొడుకును కొట్టవద్దని బంగారప్ప తల్లి వారిని ప్రాధేయపడుతున్నా వినకుండా తీవ్రంగా దాడి చేశారు.

news18-telugu
Updated: August 21, 2019, 7:15 PM IST
గర్ల్ ఫ్రెండ్‌తో టిక్ టాక్ వీడియో.. చెట్టుకు కట్టేసి కొట్టిన ‘పేరెంట్స్’
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన గర్ల్ ఫ్రెండ్‌తో టిక్ టాక్ వీడియో తీసిన వ్యక్తిని ఆమె కుటుంబసభ్యులు చెట్టుకు కట్టేసి కొట్టారు. కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో ఈ దారుణం జరిగింది. బంగారప్ప అనే యువకుడు తన గర్ల్ ఫ్రెండ్‌తో కలసి పలు టిక్ టాక్ వీడియోలు తీశాడు. అయితే, వాటికి సంబంధించిన ఓ వీడియో ఆ యువతి తల్లిదండ్రులకు చేరింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూతుర్ని పట్టుకుని నిలదీశారు. అయితే, అతడు తనకు తెలియదంటూ ఆమె మాట మార్చింది. తన వీడియోను ఎలా తీశాడో తెలియదని చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. ఓచెట్టుకు కట్టేసి కొట్టారు. యువతి తల్లి అతడిని చెప్పుతో కొడుతున్న దృశ్యాలను స్థానికులు రికార్డ్ చేశారు. తన కొడుకును కొట్టవద్దని బంగారప్ప తల్లి వారిని ప్రాధేయపడుతున్నా వినకుండా తీవ్రంగా దాడి చేశారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. అయితే, దీనిపై తమకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు