Boy chokes to death on bottle cap : నోటితో బాటిల్ మూత తీసేందుకు ప్రయత్నించగా గొంతులో క్యాప్ ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. హర్యాణా(Haryana)రాష్ట్రంలోని అంబాలాలో ఈ విషాద ఘటన జరిగింది. అంబాలా కంటోన్మెంట్ లోని డిఫెన్స్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు 15 ఏళ్ల యశ్. ప్రస్తుతం యశ్..ఇంటర్మీడియట్ మొదట సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు సాధారణంగా కూల్ డ్రింక్స్ ను తీసుకుంటారన్న విషయం తెలిసిందే. యశ్ తల్లిదండ్రులు కూడా శీతల పానీయాలను ఫ్రిడ్జ్ లో స్టాక్ ఉంచారు.
అయితే శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్ బాటిల్ మూత తెలిచేందుకు యశ్ సోదరి ఇబ్బందులు పడింది. దీంతో తాను తీస్తానని చెప్పి నోటితే తెరిచేందుకు ప్రయత్నించాడు యశ్. అయితే ఒక్కసారిగా తెరుచుకున్న క్యాప్.. యశ్ గొంతులోకి వెళ్లింది. ఆ క్యాప్ శ్వాసనాళానికి అడ్డుపడటం వల్ల ఊపిరాడక యశ్ ఇబ్బంది పడ్డాడు. మూతను గొంతులో నుంచి బయటకు తీసేందుకు కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వెంటనే యశ్ ని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే యశ్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మరోవైపు,బిహార్‌లో ఓ తండ్రి మైనర్ కూతుళ్ల పాలిట కామోన్మాదిగా మారాడు. మగసంతానం కలుగుతుందన్న తాంత్రికుడి మాటలు విని కుమార్తెలకు మత్తు బిళ్లలు ఇచ్చి కామవాంచ తీర్చుకున్నాడు. తండ్రి విటమిన్ టాబ్లెట్ల పేరుతో మత్తు బిళ్లలు ఇచ్చి తన స్నేహితుడైన తాంత్రికుడితో అత్యాచారం చేయించడాన్ని గుర్తించారు కూతుర్లు. వాళ్లు చేస్తున్న చర్యలను ఎదురు ప్రశ్నించినా..తిరస్కరించినా బాధిత బాలికలను కొట్టడం, చిత్రహింసలకు గురి చేసేవాడు. తండ్రి, తాంత్రికుడి వేధింపులు భరించలేకపోయారు బాలికలు. కనీసం ఇంట్లో ఉన్న తల్లి, మేనత్త సైతం తండ్రి, తాంత్రికుడు పాల్పడుతున్న దారుణాలకు అడ్డుచెప్పకపోగా వాళ్లకు సహాకరించే వారు. కామాంధుల మధ్య ఇంట్లో ఉండలేకపోయిన మైనర్ బాలికలు ఇల్లు వదిలిపారిపోయారు. బక్సర్ జిల్లా కేంద్రంలో ఓ గది అద్దెకు తీసుకొని అందులో నివసించారు. ఎలాగైనా తండ్రి చేసిన ఘాతుకాన్ని బయటపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి,గవర్నర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కి సైతం లేఖ రాశారు. లేఖతో తమకు జరిగిన అన్యాయం, తండ్రి పెట్టిన చిత్రహింసల గురించి వివరంగా రాశారు. ఎలాగైనా ఈ సమస్య నుంచి తమను కాపాడి..తండ్రి, తాంత్రికుడికి తగిన బుద్ధి చెప్పాలని, వాళ్లిద్దరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాలికల ఫిర్యాదు మేరకు బక్సర్ జిల్లా ఎస్పీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తండ్రి తాంత్రికుడితో పాటు మరో ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తండ్రి, తాండ్రికుడే కాదు బాలికల తల్లి, అత్త పాత్ర కూడా ఉందని తెలిసి అందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారించారు. కొడుకు పుట్టాలన్న ఆశతోనే బాలికల తండ్రి ఇలా తాంత్రికుడితో కలిసి బరితెగించాడని ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Died, Haryana