Home /News /crime /

BOXING COACH MOLESTED HIS STUDENT IN EXPRESS TRAIN ARRESTED NK

ఆ బాక్సింగ్ కోచ్ కామపిశాచి... స్టూడెంట్‌పై మళ్లీ మళ్లీ అత్యాచారం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi : ఓ బాలీవుడ్ సినిమాలో చూపించినట్లు... కోచే... తన విద్యార్థిని పట్ల రేపిస్టుగా మారాడు. ఎన్నోసార్లు అతని కుట్రలకు బలైన బాధితురాలు చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది.

    Delhi : మహిళలు తమను తాము రక్షించుకోవడానికి కరాటే, బాక్సింగ్ వంటి క్రీడల్లో ట్రైనింగ్ తీసుకుంటే మంచిదే అంటుంటారు చాలా మంది. కానీ... బాక్సింగ్ నేర్చుకున్న అమ్మాయినే... ఆమె కోచ్ చాలాసార్లు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు చెప్పిన దాని ప్రకారం... సందీప్ మాలిక్ ఓ బాక్సర్. చాలా ప్రైవేట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నాడు. ఆ కెరీర్‌ను ముగించి... బాక్సింగ్ కోచ్ అవతారం ఎత్తాడు. ఢిల్లీలోని సోనాపేట్‌లో ఓ బాక్సింగ్ అకాడెమీ ప్రారంభించాడు. చాలా మంది అందులో చేరి బాక్సింగ్ ట్రైనింగ్ పొందసాగారు. ఇంతలో... ఫిబ్రవరిలో... కోల్‌కతాలో మూుడో బెంగాల్ బాక్సింగ్ క్లాసిక్-2020 జరిగింది. అందులో పాల్గొనేందుకు తన టీమ్‌తో బయల్దేరాడు. అందరూ దురంతో ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. అప్పుడే అతని కన్ను ఓ అమ్మాయిపై పడింది. ట్రైన్‌లో అందరూ నిద్రపోతున్నప్పుడు... ఆమెను లేపి... తనతో రమ్మన్నాడు. ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడు. బాక్సింగ్‌లో ఏవైనా మెళకువలు చెబుతాడేమోనని ఆయన వెనక వెళ్లింది. తనకోసం ప్రత్యేకంగా కేటాయించుకున్న క్యాబిన్‌లోకి ఆమెను తీసుకెళ్లి... అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే... ఎవరూ నమ్మరనీ... పైగా బాక్సింగ్ కెరీరే లేకుండా చేస్తానని బెదిరించాడు. దాంతో అమాయకురాలైన ఆ బాధితురాలు... ట్రైన్‌లో అలాగే ఏడుస్తూ ప్రయాణించింది. ఆ తర్వాత... కోల్‌కతా వెళ్లాక... అక్కడ కూడా... ఓ హోటల్‌లో అందర్నీ ఉంచి... ఆమెపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిసారీ కెరీర్ లేకుండా చేస్తానని బెదిరిస్తూ... దారుణాలు చేశాడు.

    తిరిగి ఢిల్లీ వచ్చిన తర్వాత... బాధితురాలు ధైర్యంగా వెళ్లి పోలీసుల్ని కలిసింది. రాష్ట్రం కాని రాష్ట్రంలో తాను తెగించలేకపోయాననీ, ఢిల్లీకి రాగానే ధైర్యం వచ్చిందని చెప్పింది. జీరో FIR రాసిన పోలీసులు... మొదట అత్యాచారం జరిగింది రైల్లో కాబట్టి... కేసును రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వే పోలీసులు ఏదైనా కేసు వస్తే... ఫటాఫట్ తేల్చేస్తుంటారు. ముందూ వెనకా ఆలోచించడాలు ఉండవ్. ఈ కేసు విషయంలో వెంటనే సందీప్ మాలిక్‌ని అరెస్టు చేశారు. నాలుగు పోలీస్ పంచ్‌లు ఇచ్చారేమో... నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ కేసు మరో టర్న్ తీసుకుంటోంది. ఈ దుర్మార్గపు కోచ్... మరింత మంది అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉంటాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. మున్ముందు మనకు ఈ విషయాలు తెలిసే అవకాశాలున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Molestation, RAPE

    తదుపరి వార్తలు