అన్నాదమ్ముళ్లను గొడ్డళ్లతో నరికి చంపేశారు.. నల్గొండలో దారుణం

ఓ యువకుడి హత్య కేసులో ఈ ముగ్గురు అన్నాదమ్ముళ్లు జైలుకు వెళ్లొచ్చారు. ఏడాది క్రితం వివాహేతర సంబంధం విషయంలో హాలియాకు చెందిన రేవంత్‌ని హత్య చేశారు.

news18-telugu
Updated: August 3, 2020, 7:24 AM IST
అన్నాదమ్ముళ్లను గొడ్డళ్లతో నరికి చంపేశారు.. నల్గొండలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇద్దరు అన్నాదమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వారిని గొడ్డళ్లతో నరికి చంపేశారు. నల్గొండ జిల్లా అనుముల మండలం హాజరుగూడెంలో ఈ దారుణం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి, జానపాటి హరి ఆదివారం రాత్రి ఆరుబయట పడుకున్నారు. ముగ్గురు అన్నాదమ్ముళ్లు గాఢ నిద్రలో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఈ ఘటనలో జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి చనిపోయారు. మరో సోదరుడు హరి వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు.

ఐతే ఓ యువకుడి హత్య కేసులో ఈ ముగ్గురు అన్నాదమ్ముళ్లు జైలుకు వెళ్లొచ్చారు. ఏడాది క్రితం వివాహేతర సంబంధం విషయంలో హాలియాకు చెందిన రేవంత్‌ని హత్య చేశారు. పాల సేకరణ కోసం హాజరిగూడం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కాపు కాసి చంపేశారు. అనంతరం జైలుకెళ్లారు. ఐతే కొన్ని రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన అన్నాదమ్ముళ్లను చంపేసేందుకు రేవంత్ కుటుంబ సభ్యులు ప్లాన్ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే రేవంత్ తల్లి ఇందిర, మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో అర్ధరాత్రి హాజరుగూడేనికి వెళ్లి గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకేసారి అన్నాదమ్ముళ్లను నరికి చంపడంతో హాజరుగూడెం గ్రామం ఉలిక్కిపడింది.
Published by: Shiva Kumar Addula
First published: August 3, 2020, 7:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading