బోర్ కొట్టి ఇళ్లకు నిప్పు... ముంబైలో ఫైర్ ఫైటర్ నిర్వాకం

సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ర్యాన్ పై అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాదాల వెనుక ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చారు.

news18-telugu
Updated: January 13, 2019, 9:49 AM IST
బోర్ కొట్టి ఇళ్లకు నిప్పు... ముంబైలో ఫైర్ ఫైటర్ నిర్వాకం
నమూనా చిత్రం
news18-telugu
Updated: January 13, 2019, 9:49 AM IST
బోర్ కొడితే సాధారణంగా మనం ఏం చేస్తాం. టీవీ చూస్తాం. లేదంటే సరదాగా బయటకు వెళ్తాం. కాదంటే.. ఎవరికైనా ఫోన్లు చేసి మాట్లాడుకుంటాం. కానీ ఓ కుర్రాడు... తనకు బోర్ కొట్టిందని ఏకంగా ఇళ్లకు నిప్పు పెట్టాడు. ముంబైలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గత నెల 3వ తేదీ, పది తేదీల్లో ముంబైలోని కొన్ని ఇళ్లు ఉన్నట్టుండి దగ్ధమయ్యాయి. అయితే ఆ కేసును విచారించిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడ్ని విచారిస్తే వచ్చే సమాధానాలు విని షాక్ అయ్యారు. ముంబైకు చెందిన ర్యాన్ లుభం అనే 19 ఏళ్ల యువకుడు ఫైర్ ఫైటర్. అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందితో ఇతడు కూడా రంగంలోకి దిగుతుంటాడు.
మంటలు ఆర్పుతూ అందరి మన్ననలూ పొందుతుంటాడు.

అయితే అలాంటి ర్యాన్‌ను విచారించిన పోలీసులు అవాక్కయ్యారు. అతను చెప్పిన కారణాన్ని విని విస్తుపోయారు. తనకు బోర్ కొట్టిందని, అందువల్లే ఇళ్లకు నిప్పంటించానని విచారణలో ర్యాన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇళ్లకు నిప్పు పెట్టిన తర్వాత అతడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడని కూడా చెప్పాడు.

అయితే సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ర్యాన్ పై అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. అగ్నిప్రమాదాల వెనుక ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చారు. ఫైర్‌ ఫైటర్లే ఇలా నిప్పంటించడం ఇదే తొలిసారేమీ కాదు. అమెరికా సహా పలు దేశాల్లో ప్రతియేటా సుమారు వంద మందికి పైగా ఫైర్‌ ఫైటర్లు ఇలా నిప్పంటించిన కేసుల్లో అరెస్టవుతున్నారు. ముంబై వాసులు మాత్రం ర్యాన్ వెర్రి చేష్టలపై మాత్రం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బోర్ కొట్టి ఇళ్లను తగలబెట్డడం ఏంటని మండిపడుతున్నారు.

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...