జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu kashmir) ఉదంపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జవాన్ శనివారం తన ముగ్గురు సహచరులపై తన సర్వీస్ గన్ తో ఫైరింగ్ చేశాడు. దీంతో తోటి ఉద్యోగులు విగత జీవులుగా మారిపోయారు. సంఘటన స్థలంలోనే కుప్పకూలి పడిపోయారు. తోటి జవాన్లపై కాల్పులు జరిపి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. కాగా, దీంతో అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 24 గంటలు కూడా గడవక ముందే మరో ఘటన జరగటం పట్ల తీవ్రంగా స్పందించారు.వెంటనే ఘటనపై ఉన్న తాధికారుల ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ ఘటన.. ఉదంపూర్ లోని దేవిక ఘాట్ కమ్యూనిటీ సెంటర్ వద్ద మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే, శుక్రవారం రోజు కూడా ఇలాంటి ఘటన జరిగింది. J&Kలో గత 24 గంటల్లో ఇది రెండో అతిపెద్ద సోదర హత్య ఘటన. శుక్రవారం పూంచ్‌లో జరిగిన సోదరహత్య ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు (Army jawan) మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కానిస్టేబుల్ భూపేంద్ర సింగ్ తన సహోద్యోగులపై కాల్పులు జరపడంతో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రంగా బుల్లెట్ గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అధికారి తెలిపారు. కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ ఫోర్స్‌లోని 8వ బెటాలియన్‌కు చెందినవాడు. ప్రస్తుతం భద్రతా విధుల కోసం జమ్మూ కాశ్మీర్‌లో మోహరించిన ITBP యొక్క 2వ తాత్కాలిక బెటాలియన్‌కు చెందిన 'F' కంపెనీకి నియమించబడ్డాడు. వరుసగా జవాన్ల కాల్పులు ఘటనలు జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, Crime news, Gun fire, Jammu and Kashmir, Jawan