తిరుమల దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త...

ఫేక్ వెబ్‌సైట్స్ ద్వారా భక్తులను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు... నకిలీ టికెట్స్ తీసుకుని ఆలయం దాకా వెళ్లాక అసలు విషయం తెలుసుకుంటున్న భక్తులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 5:06 PM IST
తిరుమల దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త...
తిరుమల తిరుపతి దేవస్థానం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 13, 2019, 5:06 PM IST
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం కోటి మంది భక్తులు ఏడుకొండలవారిని దర్శించుకోవాలని ఎదురుచూస్తుంటారు. చాలారోజుల క్రితమే శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది టీటీడీ. తిరుమలకి వెళ్లాలనుకునే ముందే ఆన్‌లైన్ బుక్ చేస్తుంటారు భక్తులు. అయితే ఈ-దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేముందు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు ఆలయ సిబ్బంది. తాజాగా మహారాష్ట్ర నుంచి పది మంది భక్తులు ఆన్‌లైన్ ద్వారా రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని... ఆలయానికి వచ్చారు. అయితే టికెట్స్ స్కానింగ్ దగ్గర అవి నకిలీవని తేలింది. తితితే పేరిట ఉన్న మరో నకిలీ వెబ్‌సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేశారు సదరు భక్తులు. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన పంకజ్ కుటుంబసభ్యులు 12 మంది...ఇలా రూ.3600 ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి మోసపోయారు.


అంతకుముందు శ్రీవారి సేవల పేరటి కూడా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు దొరికింది. హైదరాబాద్‌లోని SR నగర్‌లో ఉండే రాజ్‌కుమార్ అనే యువకుడు... తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామివారి సేవల బుకింగ్ పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా శ్రీవారి అభిషేక పూజ, శేష వస్త్రాల బహుకరణ తదితర సేవలకు రుసుము ఫిక్స్ చేసి... అందినకాడికి దోచుకున్నాడు. ఇలా దాదాపు 500 మంది నుంచి సుమారు రూ. 20 లక్షల రూపాయాలు కాజేశాడు రాజ్‌కుమార్. విజయవాడలో ఇంతకుముందు సైబర్ ఫ్రాడ్ చేసి పోలీసులకు పట్టుబడిన సదరు వ్యక్తి... ఇప్పుడు మకాం మార్చి హైదరాబాద్‌లో అదే దందా కొనసాగించాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో టీటీడీ టికెట్స్ పేరిట జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల గురించి తెలుసుకున్నారు పోలీసులు. టీటీడీ టికెట్స్ ఆన్‌లైన్‌ బుక్ చేసే ముందు జాగ్రత్త వహించాలని కోరుతున్నారు.

First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...