• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BOMBAY HIGH COURT REFUSES BAIL TO UP MAN ACCUSED OF RAPING DAUGHTER IN LAW SU

కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిపై మామ అత్యాచారం.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే..

కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిపై మామ అత్యాచారం.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే..

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిపై మామ, అతని కుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు ఉండగా.. వారిలో ముగ్గరు నిందితులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

  • Share this:
    కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిపై మామ, అతని కుమారులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు ఉండగా.. వారిలో ముగ్గరు నిందితులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. బాధిత యువతికి 2019లో వివాహం అయింది. ఆమె భర్త ఫ్యామిలీ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అయితే పెళ్లికి ముందే బాధితురాలు తండ్రి దాదాపు 20 లక్షల రూపాయల కట్నం వరుడి కుటుంబానికి అందజేశారు. ఇక, పెళ్లి చేసుకుని జీవితంపై ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే బాధితురాలి భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించాడు. దీనిపై ఆరా తీయగా అతడు నపుంసకత్వానికి చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. అయితే 2020 జనవరి 22న బాధితురాలి రూమ్‌లోని దూరిన ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు.

    మెడికల్ ప్రాక్టీషనర్ అయిన బాధితురాలి మామ.. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ సమయంలో అతని ఇద్దరు కుమారులు ఆమె చేతులను పట్టుకున్నారు. వారిలో బాధితురాలి భర్త కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఆమెను రేప్ చేశారు.ఈ ఘటన జరిగిన తర్వాత ఆమెను పుట్టింటికి పంపించేశారు. కట్నం చెల్లించకపోతే బాధితురాలిన అత్తారింటికి తీసుకెళ్లేది లేదని ఆమె కుటుంబానికి చెప్పారు. ఇక, 2020 మార్చిలో బాధితురాలి ముంబైలో తన సోదరి ఇంటికి వెళ్లింది. అక్కడ తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పుకుని బాధపడింది. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు 2020 జూన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    ఇక, ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టులో ఫిబ్రవరి 8వ తేదీన బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగాయి. బాధితురాలి మామతో పాటు అతని ఇద్దరు కుమారులకు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు జస్టిస్ వి కొత్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ దశలో సమాచారం ఇచ్చేవారి ఆరోపణలు అవాస్తమని గమనించడం సాధ్యం కాదు. ఈ ఘటన జరిగిన కొంతకాలం తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఫిర్యాదు చేయడం ఆలస్యమైనందకు గల కారణాలను బాధితురాలు వివరించవచ్చు" అని పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు